Prabhas : ప్రభాస్(Rebel Star Prabhas) పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ గుర్రు మీదున్నారు. కాంట్రవర్సిలకు దూరంగా, ఎంతో ప్రశాంతంగా ఉండే ప్రభాస్ మీద నెటిజెన్స్ ఎందుకు ఇలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు విషయం ఏమిటంటే ఇటీవలే కాశ్మీర్ లో జరిగిన ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ సంఘటన ని చూసిన తర్వాత ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోయింది. సినీ సెలబ్రిటీలు కూడా విచారకరమైన హృదయాలతో చనిపోయిన ఆ 25 మందికి సంతాపం వ్యక్తం చేసారు. కానీ ప్రభాస్ నుండి మాత్రం అసలు రెస్పాన్స్ అనేదే లేదు. ఇదే అందరినీ ఆగ్రహానికి గురి అయ్యేలా చేస్తుంది. రెస్పాన్స్ ఇవ్వకపోగా, ఆయన కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి నిన్న ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం నెటిజెన్స్ కి మరింత కోపం రప్పించింది.
Also Read : ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయా..?
ప్రభాస్ దురాభిమానులు అయితే ట్రోలింగ్స్ నాన్ స్టాప్ గా వేస్తూనే ఉన్నారు. మరోపక్క ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి తో చేస్తున్న లవ్ స్టోరీ లో హీరోయిన్ గా పాకిస్థాన్ అమ్మాయి ఇమాన్వి నటిస్తుంది. తక్షణమే ఆమెను సినిమా నుండి తొలగించాలి అంటూ మరో డిమాండ్ కూడా వ్యక్తం అవుతుంది. చూడాలి మరి ఈరోజు, రేపు అయినా ప్రభాస్ రెస్పాన్స్ ఇస్తాడా లేదా అనేది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ప్రభాస్ హీరో గా నటించిన ‘రాజా సాబ్’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడానికి చివరి దశలో ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో ఈ ఏడాది విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు. అంతే కాకుండా చాలా వరకు సన్నివేశాలను రీ షూట్ చేయాల్సి ఉందట. అందుకు ప్రభాస్ మరో 45 రోజుల డేట్స్ ఇవ్వాలని కోరారట మేకర్స్. అందుకు ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఈ ఏడాది ప్రభాస్ ఎక్కువ శాతం డేట్స్ హను రాఘవపూడి చిత్రం కోసమే కేటాయించాడు. ‘రాజా సాబ్’ కి ఈ నాలుగు నెలల్లో ఒక్క రోజు కాల్ షీట్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆయన యూరోప్ లో ఉంటున్నాడు. ఇండియా కి తిరిగి వచ్చిన వెంటనే ‘రాజా సాబ్’ షూటింగ్ లో పాల్గొంటాడని టాక్ వినిపిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటించనున్నారు. అదే విధంగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ వ్యవహరించబోతున్నాడు. హాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన ‘హ్యారీ పోటర్’ తరహా కథ తో ఈ సినిమా సాగుతుందట. హారర్ జానర్ లో మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ తో ఒక్క సినిమా కూడా రాలేదని అంటున్నారు. త్వరలోనే టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నారు.
Also Read : ప్రభాస్ తో సూపర్ మ్యాన్ సినిమా చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసిన సుకుమార్…