Prabhas: ప్రభాస్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు.ప్రభాస్ ను చూడగానే హీరో ఫిజిక్ తో చూసే చూసే వాళ్ళను ఆకర్షిస్తుంటాడు. ప్రభాస్ తన కెరియర్ లో మాస్ సినిమాలే ఎక్కువగా చేయడం విశేషం… ఇక ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లాంటి క్లాస్ సినిమా చేసి కూడా తను ప్రేక్షకులను మెప్పించ గలిగాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు మాత్రం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎందుకంటే బాలీవుడ్ నుంచి ఎదురయ్యే పోటీలో తను నెంబర్ వన్ హీరోగా నిలవాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. కాబట్టి ఇప్పటికే ఆయన పలు కసరత్తులు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో రాణించాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ప్రభాస్ లైనప్ కనక చూసినట్టయితే ఒక మూడు సంవత్సరాల వరకు ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాజసాబ్ సినిమాను పూర్తి చేసినప్పటికి ‘ఫౌజీ’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు.
ఇక వచ్చే నెల నుంచి స్పిరిట్ సినిమాతో బిజీ కానున్నాడు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే ‘సలార్ 2’ సినిమాని స్టార్ట్ చేసే అవకాశమైతే ఉంది. ఆ సినిమాతో పాటు ‘కల్కి 2’ సినిమాలో కూడా పాల్గొనడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రశాంత్ వర్మతో సినిమా చేయాల్సింది. కానీ ఆయన అనుకోని చిక్కుల్లో ఇరుక్కోవడం వల్ల ఆల్మోస్ట్ ఈ సినిమా క్యాన్సల్ అయిందనే చెప్పాలి.
ఇక ప్రశాంత్ వర్మ సినిమా కోసం కేటాయించిన డేట్స్ ఖాళీగా ఉంటాయనే ఉద్దేశ్యంతో ఆయన రీసెంట్ గా ప్రభాస్ కథలను వినడం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగానే ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ సైతం ప్రభాస్ ని కలిసి అతనికి ఒక కథను వినిపించాడట. మొత్తానికైతే ఆ కథ అతనికి బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రానప్పటికి ప్రేమ్ రక్షిత్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక తన కొరియోగ్రఫీతో ఆస్కార్ స్థాయికి వెళ్లిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇప్పుడు ప్రభాస్ ను డైరెక్షన్ చేస్తుండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక మూవీకి సంబంధించిన న్యూస్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా? లేదంటే వార్తల వరకే పరిమితం అవుతుందా? అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…