Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ప్రభాస్ ఒకరు…ఈయన చేసిన చాలా సినిమాలు మంచి సక్సెస్ లు సాధించాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఈయనకి ఉన్న ఇమేజ్ ఏ హీరోకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో పాటుగా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించాయి. ఇక ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోడానికి రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా మీద రకరకాల రూమర్లు వస్తున్నాయి. సినిమా యూనిట్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ మంచి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమం లోనే ప్రస్తుతం ప్రభాస్ ఖాతాలో మరో డైరెక్టర్ కూడా వచ్చి చేరుతున్నాడు. ఇక ఇప్పటికే ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి సినిమా చేస్తున్నాడు.ఇక దాంతో పాటుగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా రాబోతుంది.ఇక ఇప్పుడు లోకేష్ కనకరాజ్ కూడా ప్రభాస్ కి ఒక కథ వినిపించినట్టుగా తెలుస్తుంది. లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తయ్యే లోపు ప్రభాస్ మిగతా వాళ్ల సినిమాలు కూడా కంప్లీట్ చేసుకుంటాడు.
కాబట్టి ఇద్దరు అప్పటి వరకు ఫ్రీ అవుతారు. ఇక దాంతో ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది… అయితే లోకేష్ కనకరాజ్ చెప్పిన కథ కూడా ప్రభాస్ కి బాగా నచ్చి తనతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే లోకేష్ కనకరాజ్ రీసెంట్ గా చేసిన లియో సినిమా అంత పెద్ద సక్సెస్ సాధించలేదు. ఇక దాంతో ప్రభాస్ అభిమానులు లోకేష్ తో సినిమా అంటే కొంతవరకు భయపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ సినిమాతో భారీ సక్సెస్ కొట్టడానికి ప్రభాస్ లోకేష్ ఇద్దరు ఒక మంచి కథతో వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ విషయం నిజమా అబద్దమా అని తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాలి. అప్పుడు మాత్రమే నమ్మడానికి అవకాశం ఉంటుంది.
అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం లోకేష్ కనకారాజ్ తో సినిమా చేయడం కంటే వేరే వాళ్ళతో సినిమా చేస్తే బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తను సినిమా మీద సరైన దృష్టి పెట్టకుండా లోకేష్ యూనివర్స్ లో సినిమాలు ఎలా చేయాలి దానికి అనుగుణంగా కథని ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు అందువల్లే లియో సినిమా ప్లాప్ అయ్యింది అంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా లో ఈ న్యూస్ ని వైరల్ చేస్తున్నారు…