https://oktelugu.com/

Prabhas movie : వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ మూవీ! బడ్జెట్, డైరెక్టర్… మైండ్ బ్లోయింగ్ డిటైల్స్!

ఒక సైనికుడి ప్రేమ కథను గొప్పగా ఆవిష్కరించాడు. ప్రభాస్ అందుకే హను రాఘవపూడికి ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు. అయితే ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2023 / 04:46 PM IST
    Follow us on

    Prabhas movie : ప్రభాస్ శరవేగంగా చిత్రాలు చేస్తున్నారు. బాహుబలి తర్వాత ఆయన రెండేళ్లకు ఓ మూవీ చొప్పున చేశారు. బాహుబలి 2015లో విడుదల కాగా బాహుబలి 2 విడుదలకు కావడానికి మరో రెండేళ్లు సమయం పట్టింది. సాహో రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అభిమానుల బాధ అర్థం చేసుకున్న ప్రభాస్ వీలైంతన త్వరగా చిత్రాలు విడుదల చేస్తానని హామీ ఇచ్చాడు. రాధే శ్యామ్ విడుదలైన మరో ఏడాదికి ఆదిపురుష్ థియేటర్స్ లోకి తెచ్చారు.

    ఆదిపురుష్ విడుదలైన ఆరు నెలల్లో సలార్ తో మాస్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ డిసెంబర్ 22న విడుదల కానుంది. 2023లో ప్రభాస్ రెండు సినిమాలు విడుదల చేయడం ఈ మధ్య కాలంలో లేని రికార్డు. సలార్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 AD, మారుతీ దర్శకత్వంలో చేస్తున్న రాజా డీలక్స్ సెట్స్ పై ఉన్నాయి.

    స్పిరిట్ టైటిల్ తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఒక మూవీ ప్రకటించారు. అలాగే సలార్ 2 ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ మరో మూవీకి సైన్ చేశాడంటూ టాలీవుడ్ టాక్. దర్శకుడు హను రాఘవపూడి స్క్రిప్ట్ కి ఇంప్రెస్ అయిన ప్రభాస్ పచ్చ జెండా ఊపాడట. ఆసక్తికర విషయం ఏమిటంటే… ఇది వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందట. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీగా ప్లాన్ చేస్తున్నారట.

    ప్రభాస్ హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్, అలాగే ఓ బాలీవుడ్ బ్యానర్ కలిసి నిర్మిస్తారట. ప్రభాస్ కెరీర్లో స్పెషల్ మూవీగా ఈ పీరియాడిక్ వార్ డ్రామా నిలుస్తుందని అంటున్నారు. హను రాఘవపూడి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుగాంచాడు. ఆయన లాస్ట్ రిలీజ్ సీతారామం బ్లాక్ బస్టర్ హిట్. ఒక సైనికుడి ప్రేమ కథను గొప్పగా ఆవిష్కరించాడు. ప్రభాస్ అందుకే హను రాఘవపూడికి ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు. అయితే ఎలాంటి అధికారిక సమాచారం లేదు.