Ram Charan- Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాధారణంగా టాక్ షోస్ కి రావడం పెద్దగా ఎప్పుడూ జరగలేదు..మొట్టమొదటిసారి ఆయన నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK 2 ‘ ప్రోగ్రాం కి హాజరయ్యాడు..ఈమధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ అతి త్వరలోనే ఆహా మీడియా లో ప్రసారం కాబోతుంది..ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారింది.

ఈ ఎపిసోడ్ కి ప్రభాస్ తో పాటుగా ఆయన క్లోజ్ ఫ్రెండ్ గోపీచంద్ కూడా హాజరయ్యాడు..వీళ్లిద్దరి తో బాలయ్య బాబు సరదాగా చేసిన చిట్ చాట్ ఫ్యాన్స్ కి కనులపండుగ లాగా ఉండబోతుంది.. బాలయ్య బాబు కోసం ప్రభాస్ తన ఇంటి నుండి ప్రత్యేకంగా వంటకాలు చేయించి తీసుకొచ్చాడట..అంతే కాకుండా ఈ టాక్ షో లో ఎన్నో సర్ప్రైజ్ లు ఉండబోతున్నాయి..ప్రభాస్ పెళ్లి గురించి కూడా ఒక గుడ్ న్యూస్ ఈ షో ద్వారా బయటకి రాబోతుందట.
ఇక ప్రభాస్ కి టాలీవుడ్ లో గోపీచంద్ తో పాటుగా ఎన్టీఆర్, అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్స్..ఈ విషయాన్నీ ఆయన అనేక సందర్భాలలో తెలిపాడు కూడా..అయితే ప్రభాస్ పాల్గొన్న అన్ స్టాపబుల్ షో లో రామ్ చరణ్ వీడియో కాల్ ద్వారా కలుస్తాడట..ఈ కాల్ లో రామ్ చరణ్ ప్రభాస్ పెళ్లి గురించి ఒక అప్డేట్ లీక్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఒక షో లో బాలయ్య లాంటి హీరో తో ప్రభాస్ , గోపీచంద్ మరియు రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు ముఖాముఖీ అవ్వడం చాలా అరుదు.

ఈ క్రేజీ ఎపిసోడ్ కోసం కేవలం నందమూరి మరియు ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు..ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..అన్ స్టాపబుల్ రెండు సీజన్స్ కి కలిపి అత్యధిక వ్యూస్ వచ్చిన ఎపిసోడ్ గా మహేష్ బాబు – బాలయ్య బాబు చిట్ చాట్ నిలిచింది..ఇప్పుడు ఆ రికార్డుని ప్రభాస్ – బాలయ్య చిట్ చాట్ ఎపిసోడ్ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.