The Raja Saab Pre Release Event: రెబల్ స్టార్ ప్రభాస్(RebelStar Prabhas) నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజాసాబ్'(The Rajasaab Movie) వచ్చే నెల 9న విడుదల అవ్వబోతున్న సందర్భంగా నిన్న ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతం లో వేలాది మంది అభిమానుల సమక్ష్యం లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ ప్రభాస్ అభిమానులకు కొన్నేళ్ల పాటు గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ ఎంతో చలాకీగా మాట్లాడడం, డైరెక్టర్ మారుతీ ఈ సినిమా పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో భారీ గా హైప్ పెంచే మాటలు మాట్లాడడం,ఇలా ప్రతీ ఒక్కటీ పాజిటివ్ గానే జరిగింది. ప్రభాస్ అభిమానులు రాజా సాబ్ విషయం లో ఎక్కడో నిరాశ చెందుతూ వచ్చారు. సరైన హైప్ కంటెంట్ రావడం లేదే అని , నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమా పై భారీ హైప్ ని పెంచడం లో సక్సెస్ అయ్యాయి అని చెప్పొచ్చు.
ఓవర్సీస్ లో గత కొద్దిరోజుల నుండి అడ్వాన్స్ బుకింగ్స్ రాజాసాబ్ కి చాలా వీక్ గా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత కచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే నిన్నటి ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది. గుబురు గెడ్డం తో, జుట్టు బాగా పెంచి, వెనుక పోనీ టైల్ వేసుకొని వచ్చాడు. ఇదేంటీ ‘స్పిరిట్’ మూవీ లుక్ లో ప్రభాస్ ఉంటాడని అనుకుంటే, ఇలా ఉన్నాడు?, కొంపదీసి స్పిరిట్ మూవీ లుక్ ఇదేనా?. స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ చేస్తున్నాడు. పోలీస్ కి అంత గెడ్డం ఉండదు కదా?..మొదటి షెడ్యూల్ లో ప్రభాస్ పై జైలు సన్నివేశాలు తీసారని అన్నారు.
జైల్లో ఉన్న ఖైదీలకు కూడా అంతటి గెడ్డం ఉండకూడదు కదా?, మరి ఈ లుక్ ఏంటి అని చర్చించుకుంటున్నారు. గత నెల 27 వ తారీఖు నుండి ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ మొదలైంది. మొదటి షెడ్యూల్ వారం రోజులు జరిగితే, ప్రభాస్ నాలుగు రోజులు పాల్గొన్నాడు. రెండవ షెడ్యూల్ ప్రభాస్ లేకుండా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపతి షెడ్యూల్ కోసం మూవీ టీం మొత్తం మెక్సికో కి వెళ్లనుంది. ఈ సినిమా పై అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా ఎవ్వరూ ఊహించని రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ చిత్రం మేరకు అందుకుంటుందో చూడాలి.