Prabhas And Koratala Siva: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మిర్చి సినిమా అప్పట్లో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారి షేక్ అయింది.ఈ సినిమాలో ప్రభాస్ నటన కానీ కొరటాల మేకింగ్ కానీ చాలా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక దాంతో అప్పటినుంచి వీళ్ళ కాంబో మరొకసారి ఎప్పుడు రిపీట్ అవుతుందా అంటూ చాలామంది అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇక అటు కొరటాల కానీ, ప్రభాస్ కాని ఇద్దరూ కూడా కలిసి సినిమా చేయడానికి చాలా సన్నాహాలను చేస్తున్నప్పటికీ వాళ్ళకున్న బిజీ వల్ల ఆ ప్రాజెక్టు అనేది పట్టాలెక్కడం లేదు. ఇక కొరటాల స్వతహాగా రైటర్ కావడం వల్ల ప్రభాస్ తో చేయాల్సిన సినిమా స్టోరీని ఇప్పటికే రెడీ చేసుకొని పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొరటాల ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర అనే సినిమా చేస్తున్నాడు అలాగే ప్రభాస్ కూడా వరుసగా మూడు సినిమాలు కమిట్ అయి ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఒప్పుకున్న కమిట్ మెంట్ అన్ని పూర్తయిన తర్వాత కొరటాల ఒక భారీ రేంజ్ లో యాక్షన్ సినిమా అనేది రాబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ కాంబో పైన ఎప్పటినుంచో ప్రభాస్ అభిమానులు కూడా విపరీతంగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ విషయం మీద తాజాగా కొరటాల కూడా ప్రభాస్ తో సినిమా ఉంటుంది అని తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రభాస్ కూడా కొరటాలతో సినిమాకి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆచార్య సినిమాతో ఒక డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న కొరటాల ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న దేవర సినిమా తో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమా రెండు పార్టీలుగా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాతో కనక కొరటాల భారీ సక్సెస్ ని కొడితే కొరటాల క్రేజ్ కూడా అమాంతం తార స్థాయికి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
దాంతో అప్పుడు ప్రభాస్ కొరటాల కాంబో పైన మరింత అంచనాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక ఇప్పటికే ప్రభాస్ అభిమానులు వీళ్ళ కాంబో లో వచ్చే సినిమా ఎలా ఉంటుందో అంటూ ఊహించుకుంటున్నారు… చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో…