Prabhas: ప్రభాస్ టాలీవుడ్ టాప్ స్టార్స్. కలెక్షన్స్ పరంగా చూస్తే అందరికంటే ముందంజలో ఉన్నాడు. వెయ్యి కోట్ల వసూళ్ల మార్క్ సాధించిన మొదటి ఇండియన్ హీరో ప్రభాస్. అనంతరం ఈ ఫీట్ అమీర్ ఖాన్, ఎన్టీఆర్-రామ్ చరణ్, యష్ వంటి హీరోలు సాధించారు. ప్రభాస్ అభిమానులు తమ హీరో విజయాలను, అరుదైన మైలురాళ్లను కొనియాడతారు. అయితే ప్రభాస్ అభిమానుల్లో ఒక నిరాశ ఉంది. అది ఆయన వివాహం. ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని, నట వారసుడిని ఇవ్వాలని వారు గట్టిగా కోరుకుంటున్నారు.
దాదాపు పదేళ్ల కాలంగా ప్రభాస్ పెళ్లి వార్తలు తరచుగా కనిపిస్తున్నాయి. త్వరలో ప్రభాస్ పెళ్లి అంటూ కథనాలు వెలువడుతున్నాయి. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు, పెద్దమ్మ శ్యామలాదేవి సైతం పలుమార్లు ప్రకటనలు చేశారు. త్వరలో పెళ్లి అంటూ ఊరించారు. కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు. అదే సమయంలో ప్రభాస్ ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా అనుష్కతో రిలేషన్ లో ఉన్న ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నాడని కథనాలు వెలువడ్డాయి.
అలాగే ఆదిపురుష్ సమయంలో కృతి సనన్ తో ప్రేమలో పడ్డాడు. త్వరలో ఆమెతో పెళ్లి అని కూడా వార్తలు వచ్చాయి. ఇవ్వన్నీ పుకార్లు గానే మిగిలిపోయాయి. అక్టోబర్ 23న 45వ జన్మదినం జరుపుకున్న ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అనే సందేహం అందరిలో మొదలైంది. అయితే గతంలోనే ప్రభాస్ తన పెళ్లి పై హింట్ ఇచ్చాడు. ఆయనకు ఆలోచన లేదని చెప్పకనే చెప్పాడు. ప్రభాస్ కొందరు అమ్మాయిలతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ క్రమంలో ఓ అమ్మాయి.. మీరు అమ్మాయిల హృదయాలను బ్రేక్ చేసే రోజు ఎప్పుడు? అని అడిగింది. దానర్థం.. మీరు పెళ్లి చేసుకుంటే లేడీ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అవుతుంది. కాబట్టి పెళ్లి ఎప్పుడని అడిగింది. నాకు అమ్మాయిల హృదయాలను బ్రేక్ చేయడం ఇష్టం లేదు. కనుక ఎప్పటికీ బ్రేక్ చేయను అన్నాడు. పరోక్షంగా ప్రభాస్ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పాడు.
పెళ్లిపై ప్రభాస్ స్పందించిన మరొక సందర్భం అన్ స్టాపబుల్ షో. బాలయ్య గట్టిగా పట్టుబట్టడంతో అమ్మాయి దొరకడం లేదని ఒక సమాధానం చెప్పాడు. సల్మాన్ పెళ్లి తర్వాతే నా పెళ్లి అని మరో సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. ఈ పరిణామాలు గమనిస్తుంటే ప్రభాస్ కి పెళ్లి ఆలోచన లేదని అర్థం అవుతుంది. అదే నిజమైతే ఫ్యాన్స్ కి వేదన తప్పదు.
Web Title: Prabhas just hinted about marriage
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com