Pawan Kalyan and Prabhas: సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంటుందనే విషయం మన హీరోలు చాలాసార్లు ప్రూవ్ చేశారు. సీనియర్ హీరోల దగ్గర నుంచి ఇప్పుడున్న స్టార్ హీరోలు అలాగే యంగ్ హీరోలా దాకా అందరి మధ్య మంచి సన్నిహిత్యం అయితే ఉంటుంది. ఇక ఇలాంటి సందర్భంలోనే యంగ్ రెబల్ స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ప్రభాస్..అలాగే పవర్ స్టార్ గా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లను అందుకున్న పవన్ కళ్యాణ్ కి ప్రభాస్ తనని తాను మొదటిసారి డిఫరెంట్ గా పరిచయం చేసుకున్నాడట…
అంటే పవన్ కళ్యాణ్ మొదట వైజాగ్ సత్యానంద్ దగ్గర యాక్టింగ్ స్కూల్లో నటన కి సంభందించిన మెలుకువలను నేర్చుకున్నాడు. ఇక తను హీరో అవ్వాలని అనుకున్న తర్వాత ప్రభాస్ కూడా సత్యానంద్ దగ్గరే యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. ఇక ఆ శిక్షణ అయిపోయిన తర్వాత కంగ్రాట్స్ చెబుతూ ఆ బ్యాచ్ కి ఫేర్వెల్ ని నిర్వహించారట. ఇక ఇలాంటి క్రమంలోనే ఆ పార్టీ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారట. దాంతో యాక్టింగ్ స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ కి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటూ ఉంటే ప్రభాస్ కూడా తనని తాను డిఫరెంట్ గా పరిచయం చేసుకున్నాడట.
అది ఎలా అంటే ‘నా పేరు ప్రభాస్ రాజ్, ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన కష్టం రాజు వాళ్ళ తమ్ముడి కొడుకుని’ అని తనని తాను పరిచయం చేసుకున్నాడట. దాంతో పవన్ కళ్యాణ్ ఒకసారి గా షాక్ అయ్యారంట. పవన్ కళ్యాణ్ కి ప్రభాస్ గురించి పెద్దగా ఐడియా లేదు. కొన్ని సందర్భాల్లో కృష్ణంరాజు గారి వాళ్ళ తమ్ముడి కొడుకు హీరోగా వస్తున్నాడు అనే న్యూస్ విన్నాడు. కానీ డైరెక్టుగా ప్రభాస్ ను మాత్రం అప్పటివరకు చూడలేదట. దాంతో ప్రభాస్ తనని తాను పరిచయం చేసుకున్న విధానాన్ని చూసి పవన్ కళ్యాణ్ చాలా సంతోషపడ్డాడట.
ఇక పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రభాస్ ఆటిట్యూడ్ కి ఫిదా అయిపోయాడట. ఇక అప్పటినుంచి పవన్ కళ్యాణ్, ప్రభాస్ లా మధ్య మంచి సన్నిహిత్యమైతే ఉంది. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ స్పీచ్ లో కూడా ప్రభాస్ గురించి ఆయన చేసిన సినిమాలా గురించి మాట్లాడడం మనం చూశాం…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఇద్దరు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.