https://oktelugu.com/

Prabhas Adipurush: ఏ- ఆది పురుష్” పై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Prabhas Adipurush: నేషనల్ స్టార్ ప్రభాస్ మొదటిసారిగా శ్రీరాముడిగా నటిస్తోన్నాడు అనగానే, ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. పైగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా “ఏ- ఆది పురుష్” రాబోతుంది. దీనికితోడు బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు ఓం రౌత్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఐతే తాజాగా ఈ సినిమా గురించి ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “ఆదిపురుష్” చిత్రం తన జీవితంలో చాలా ముఖ్య‌మైన ప్రాజెక్టని హీరో […]

Written By:
  • Shiva
  • , Updated On : April 1, 2022 / 01:41 PM IST
    Follow us on

    Prabhas Adipurush: నేషనల్ స్టార్ ప్రభాస్ మొదటిసారిగా శ్రీరాముడిగా నటిస్తోన్నాడు అనగానే, ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. పైగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా “ఏ- ఆది పురుష్” రాబోతుంది. దీనికితోడు బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు ఓం రౌత్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఐతే తాజాగా ఈ సినిమా గురించి ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

    Prabhas Adipurush

    “ఆదిపురుష్” చిత్రం తన జీవితంలో చాలా ముఖ్య‌మైన ప్రాజెక్టని హీరో ప్రభాస్ అన్నాడు. ఆదిపురుష్ తనకు సినిమా కంటే ఎక్కువ‌ని వ్యాఖ్యానించాడు. సినిమాకు బాక్సాపీస్ రికార్డులు ముఖ్యం కాదని.. బ‌డ్జెట్‌, ప్ర‌జ‌ల అంగీకారం ముఖ్యమని అన్నాడు. తన సినిమాతో ఎంత మంది నిరాశ చెందుతున్నారు, ఎందరు సంతోషంగా ఉంటున్నారో.. బాక్సాపీస్ ద్వారా మాత్రమే తెలుసుకోగ‌లుగుతానని ప్ర‌భాస్‌ చెప్పాడు.

    Also Read: Nara Lokesh: జ‌నం చెవిలో జ‌గ‌న్ పూలు.. లోకేష్ సెటైరిక‌ల్ ట్వీట్.. మార్పు మొద‌లైందా..?

    కాగా ఆదిపురుష్ చిత్రాన్ని ఒకే స‌మ‌యంలో 15 దేశీయ‌, అంత‌ర్జాతీయ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతుండగా.. సీతగా కృతి సనన్ రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత వున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది.

    ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక్క సీన్ కోసం భారీగా ఖర్చు చేశారని.. ఈ సినిమాలో ఒక కీలక సన్నివేశం కోసం మేకర్స్ ఏకంగా 60 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. మొత్తానికి ఈ వార్త ఈ సినిమా కోసం యావత్తు భారత దేశం ఎదురుచూసేలా చేస్తోంది. అందుకే స్పీడ్ గా ఆదిపురుష్ సినిమా మోషన్ కాప్చర్ ప్రారంభమైంది. ఇప్పటికే మేకర్స్ షూట్ కి సన్నాహాలు చెసారు.

    కాగా లేటెస్ట్ టెక్నాలజీతో తయారయ్యే సినిమాలో భారీ సెట్లు, భారీ క్రూ వగైరా వ్యవహారాలు లాంటివి లేకుండా మోషన్ కాప్చర్ విధానంలో నటీనటుల కదలికలు, హావభావాలు రికార్డుచేసి, వాటికి సాంకేతికత సాయంతో మిగిలిన హంగులను జోడిస్తారట. దీనివల్ల సినిమా చూడడానికి బాగా ఆసక్తికరంగా వుంటుందని, పైగా చాలా సమయం కూడా ఆదా అవుతుందని అంటున్నారు మేకర్స్.

    Prabhas Adipurush

    ఏది ఏమైనా హాలీవుడ్ సినిమాల్లో ఇప్పటికే ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీని ఇండియన్ సినిమాలో పూర్తిగా వాడుకోవడం అంటే.. బహుశా ఇదే తొలిసారి అనుకుంటా. ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే.

    Also Read: Ram Gopal Varma: అబ‌ద్ధం చెప్పి ఆర్జీవీ తీసిన ఇండ‌స్ట్రీ హిట్ మూవీ ఏదో తెలుసా..?

    Tags