Pawan Kalyan And Lokesh Kanagaraj: ‘ఓజీ'(They Call Him OG) సక్సెస్ తో మంచి ఊపు మీదున్న పవన్(Deputy CM Pawan Kalyan) ఫ్యాన్స్ తమ అభిమాన హీరో తదుపరి చిత్రం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ అయ్యింది, పవన్ కళ్యాణ్ నుండి తదుపరి వచ్చే చిత్రమిదే. ఈ సినిమా పై ప్రస్తుతానికి ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలు లేవు, భవిష్యత్తులో మూవీ టీం విడుదల చేసే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఈ సినిమాకు హైప్ వస్తే రావొచ్చు కానీ, ప్రస్తుతానికి అయితే హైవైపే లేదు. ఈ సినిమా సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అభిమానులను ఒక వార్త పట్టరాని ఆనాడు గురయ్యేలా చేసింది. అదేమిటంటే త్వరలోనే ఆయన తమిళ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం లో నటించబోతున్నాడని, కన్నడ లీడింగ్ ప్రొడక్షన్ సంస్థ KVN ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది అనే టాక్ వచ్చింది.
సోషల్ మీడియా ని షేక్ చేసిన వార్త ఇది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ కూడా ఈ రేంజ్ న్యూస్ వచ్చేసరికి అభిమానులు మెంటలెక్కిపోయారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా లో ప్రచారం సాగుతుంది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ సోలో హీరో చిత్రం కాదని, మల్టీస్టార్రర్ అని, ప్రభాస్(Rebel Star Prabhas) కూడా ఈ చిత్రం లో ఇంకో హీరో గా నటిస్తాడని అంటున్నారు. ఈమధ్య కాలం లో రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీ స్టార్రర్ చిత్రం, లోకేష్ దర్శకత్వం లో తెరకెక్కబోతుంది అనేది కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన వార్త. ఇప్పుడు అదే స్టోరీ లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి పవన్ కళ్యాణ్, ప్రభాస్ మల్టీస్టార్రర్ గా తీసే ఆలోచనలో ఉన్నాడట లోకేష్ . ఇదే కనుక నిజమైతే ఈ సినిమా ఓపెనింగ్ రికార్డ్స్ శాశ్వతంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో అలా నిలిచిపోతాయని, బాక్స్ ఆఫీస్ వద్ద కలలో కూడా ఊహించని అద్భుతాలు నెలకొల్పుతుందని అంటున్నారు.
ఇది కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమే అట. అయితే ఈ యూనివర్స్ కి గతలో ఆయన తెరకెక్కించిన విక్రమ్, లియో,ఖైదీ యూనివర్స్ కి ఎలాంటి సంబంధం ఉండదట. ఒక సరికొత్త యూనివర్స్ గా ఈ ఫ్రాంచైజ్ ఉండబోతుందని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఇది సూపర్ నేచురల్ పవర్స్ మీద తెరకెక్కే సినిమా లాగా అనిపిస్తుంది. అంటే సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ తరహా అన్నమాట. ముందుగా ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ తో తియ్యాలని అనుకున్నారు. కానీ కూలీ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో ఆయనతో కాకుండా పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో చేసే ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం లోకేష్ ‘ఖైదీ 2’ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వగానే ఆయన పవన్ కళ్యాణ్, ప్రభాస్ మల్టీస్టార్రర్ పై ఫోకస్ పెట్టబోతున్నాడు.