Baahubali The Epic re-release: ఒకప్పుడు మన టాలీవుడ్ లో ‘నాన్ బాహుబలి’ రికార్డ్స్ అనే క్యాటగిరీ ఉండేది. అంటే ఈ సినిమా రికార్డ్స్ ని అందుకోవడం ఏ సినిమాకు అయినా కష్టం కాబట్టి, ఈ చిత్రం తర్వాత రెండవ స్థానంలో నిల్చున్న చిత్రం రికార్డు ని నాన్ బాహుబలి రికార్డు గా పిలిచేవారు. ఇప్పుడు ఈ క్యాటగిరీ రీ రిలీజ్ కి కూడా వచ్చేసింది. బాహుబలి 1 , బాహుబలి 2 చిత్రాలను ఒక సినిమాగా ఎడిట్ చేసి, సరికొత్త సౌండింగ్ తో, అద్భుతమైన విజువల్ క్వాలిటీ తో ‘బాహుబలి : ది ఎపిక్'(Bahubali : The Epic) అనే 3 గంటల 45 నిమిషాల సినిమాని నేడు థియేటర్స్ లో విడుదల చేశారు. ఈ రీ రిలీజ్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ఎన్నో రీ రిలీజ్ చిత్రాలు వచ్చాయి. కానీ ఏది కూడా సరైన క్వాలిటీ తో రాలేదు.
కేవలం అభిమానుల ప్రేమని, ఎమోషన్స్ ని క్యాష్ చేసుకోవడం కోసమే రీ రిలీజ్ అన్నట్టు ఉండేదని, కానీ రాజమౌళి మాత్రం ఆడియన్స్ ని మోసం చేయకుండా, అద్భుతమైన క్వాలిటీ తో ఈ చిత్రాన్ని ఎడిటింగ్ చేసి రీ రిలీజ్ చేసారని, అసలు చూసే ఆడియన్స్ కి ఈ సినిమా పాత సినిమా అనే ఫీలింగ్ ఇసుమంత కూడా కలగలేదని, ఒక కొత్త సినిమాని చూస్తున్నట్టే అనిపించిందని అంటున్నారు. అభిమానుల ఫీడ్ బ్యాక్ కి తగ్గట్టుగానే ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం సరికొత్త ప్రభంజనం సృష్టించింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకు నైజాం లో ప్రీమియర్స్ + మొదటి రోజు రెగ్యులర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ తో కలిపి నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
అండ్ విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ చిత్రానికి మూడు కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయని, కానీ ఇక్కడ మాత్రం ఆల్ టైం రికార్డు ని నెలకొల్పలేకపోయింది అని, గబ్బర్ సింగ్ నే ఇప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో రికార్డు అని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపుగా 12 కోట్ల రూపాయిల వరకు జరిగిందని, రిలీజ్ తర్వాత 15 కోట్ల రూపాయిల వరకు చేరే అవకాశం ఉంటుందని అంటున్నారు. అదే కనుక నిజమైతే ఇప్పట్లో ఈ రికార్డు ని అందుకోవడం ఏ రీ రిలీజ్ కి కూడా సాధ్యం అవ్వదు అనే చెప్పాలి. మీడియం రేంజ్ హీరోలు కొత్త సినిమాలతో కూడా పెట్ట్టాలేకపోతున్న గ్రాస్ ని బాహుబలి చిత్రం రీ రిలీజ్ లో కూడా పెట్టిందని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.