Swetha Agarwal: హీరోయిన్స్ కి వాలిడిటీ తక్కువ. స్టార్ అయిన వాళ్ళు కూడా పదేళ్ల లోపే చాప చుట్టేస్తారు. కొందరు మాత్రమే రెండు మూడు దశాబ్దాలు పరిశ్రమలో ఉంటారు. స్టార్డం దక్కని హీరోయిన్స్ అయితే నాలుగైదేళ్లు రాణించడం కష్టమే. ప్రభాస్ వంటి టాప్ స్టార్ పక్కన శ్వేత అగర్వాల్ తక్కువ కాలంలో వెండితెరకు దూరమైంది. శ్వేత అగర్వాల్ ని దర్శకుడు రవిబాబు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. నరేష్ డెబ్యూ మూవీలో అల్లరి లో శ్వేత నటించింది.
అనంతరం సుదీప్ పక్క కిచ్చ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. కన్నడ మూవీ కిచ్చ మంచి విజయం సాధించింది. అయినా ఆమెకు కన్నడ చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. మలయాళంలో ఓ మూవీ చేసింది. నాలుగో చిత్రంగా రాఘవేంద్ర చేసింది. ఇది ప్రభాస్ రెండో చిత్రం. ప్రభాస్ ఆహార్యం రీత్యా కెరీర్ బిగినింగ్ నుండే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ చేశాడు. రాఘవేంద్ర చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకుడు.
భాష మూవీతో సురేష్ కృష్ణ ఫేమ్ దేశవ్యాప్తం అయ్యింది. సురేష్ కృష్ణ భాష షేడ్స్, స్క్రీన్ ప్లే తోనే రాఘవేంద్ర తెరకెక్కించాడు. తల్లిదండ్రుల సలహా మేరకు హీరో కోపం వదిలేసి సాధు జీవిగా మారిపోతాడు. ఈ మూవీ కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. రాఘవేంద్ర మూవీలో అన్షు మెయిన్ హీరోయిన్ కాగా… శ్వేత అగర్వాల్ సెకండ్ హీరోయిన్ గా చేసింది. శ్వేత ప్రభాస్ మరదలిగా నటించింది. శ్వేత అగర్వాల్ కి బ్రేక్ రాలేదు.
రాఘవేంద్ర అనంతరం చాలా గ్యాప్ తర్వాత గమ్యం చిత్రంలో కనిపించింది. 2008లో ఓ హిందీ చిత్రం చేసిన శ్వేత అగర్వాల్ చిత్ర పరిశ్రమకు దూరమైంది. 2020లో శ్వేత అగర్వాల్ సింగర్ ఆదిత్య నారాయణ్ ని వివాహం చేసుకుంది. ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ కొడుకే ఈ ఆదిత్య నారాయణ్. వీరికి ఒక అమ్మాయి సంతానం. పెళ్ళై పిల్లలు పుట్టాక శ్వేత అగర్వాల్ గుర్తు పట్టలేనంతగా తయారైంది. ఒకప్పుడు నాజూగ్గా కవ్వించిన అమ్మడు బొద్దుగా తయారైంది. అయితే ఫ్యాన్స్ కి ఇంస్టాగ్రామ్ ద్వారా అందుబాటులో ఉంటుంది.