https://oktelugu.com/

Prabhas : ప్రభాస్ మొబైల్ స్క్రీన్ సేవర్ గా ఎవరి ఫోటో పెట్టుకున్నాడో తెలుసా? ఇంట్రెస్టింగ్ స్టోరీ

హీరో ప్రభాస్ తన మొబైల్ లో ఒకరి ఫోటో స్క్రీన్ సేవర్ గా పెట్టుకున్నాడు. ఆ ఫోటో ఎవరిదీ? దాని వెనకున్న నేపథ్యం ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : November 2, 2024 / 06:10 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అమితాబ్, దీపికా పదుకొనె, దిశా పటాని, కమల్ హాసన్ వంటి స్టార్ క్యాస్ట్ కల్కి చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రాజా సాబ్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రభాస్ జన్మదినం కానుకగా రాజా సాబ్ పోస్టర్ విడుదల చేశారు. ఆకట్టుకుంది. ఈ చిత్రానికి మారుతీ దర్శకుడు.

    ప్రభాస్ చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కల్కి 2, సలార్ 2 చిత్రాలు ఆయన పూర్తి చేయాల్సి ఉంది. అలాగే దర్శకుడు హను రాఘవపూడితో ఒక చిత్రానికి కమిట్ అయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుంది. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయాల్సి ఉంది. వరుసగా ప్రభాస్ భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.

    ఇదిలా ఉంటే ప్రభాస్ కి సంబంధించిన ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. అది ఆయన వ్యక్తిగత విషయం. ప్రభాస్ తన మొబైల్ స్క్రీన్ సేవర్ గా ఒక ఫోటో పెట్టుకున్నాడట. ఆ ఫోటోని ప్రభాస్ ఎప్పుడూ మార్చడు అట. ఆ ఫోటో ఎవరిదో కాదు ప్రభాస్ తల్లిదండ్రులది. తన పేరెంట్స్ ఆయన కలిసి దిగిన ఫోటోను ప్రభాస్ స్క్రీన్ సేవర్ గా పెట్టుకున్నాడట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

    మరోవైపు ప్రభాస్ వివాహం చేసుకోవడం లేదు. ఆయన వయసు 45 ఏళ్లకు చేరువైంది. అసలు వివాహం చేసుకునే ఆలోచన ఉందా లేదా? అనేది కూడా తెలియదు. ప్రభాస్ ఈ విషయాన్ని దాట వేస్తున్నాడు. ప్రభాస్ ఈ మధ్య కాలంలో వివాహం పై స్పందించలేదు. అయితే గతంలో అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ బాలకృష్ణ ప్రభాస్ ని పెళ్లి పై క్లారిటీ ఇవ్వాలని నిలదీశాడు. కానీ ప్రభాస్ తెలివిగా తప్పించుకున్నాడు. ప్రభాస్ కి పెళ్లి ఆలోచన లేదనే ఓ వాదన వినిపిస్తుంది.

    కాగా అనుష్క శెట్టి, కృతి సనన్ వంటి హీరోయిన్స్ తో ప్రభాస్ కి ఎఫైర్ ఉందనే వాదనలు వినిపించాయి. ఇవన్నీ పుకార్లు గానే మిగిలిపోయాయి. ప్రభాస్ వివాహం చేసుకుని వారసుడిని ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. వారి కోరిక ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి…