Raja Saab Pre Release Event: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్'(Raja Saab Movie) జనవరి 9న విడుదల అవ్వబోతున్న సందర్భంగా, ఆ మూవీ టీం ప్రొమోషన్స్ ని గ్రాండ్ గా మొదలు పెట్టింది. నిన్న హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతం లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో అట్టహాసం గా జరిగింది. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ ఈవెంట్ ఒక విజువల్ ఫీస్ట్, ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకం గా మిగిలింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ ప్రసంగం, డైరెక్టర్ మారుతీ ఎమోషనల్ కామెంట్స్, ఈ సినిమా పై హైప్ పెంచడం లో ఉపయోగపడ్డాయి. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ స్పీడ్ కూడా ఊపందుకుంది. ఇకపోతే ఈ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడిన ఒక మాట ని మెగా అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ బాగా వైరల్ చేశారు.
సంక్రాంతికి ‘రాజా సాబ్’ చిత్రం తో పాటు, విడుదల అవ్వబోయే సినిమాలకు ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపాడు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం గురించి ప్రత్యేకించి చెప్పాడు. ఆయన మాట్లాడుతూ ‘ఎంతైనా సీనియర్..సీనియరే. ఆయన నుండే మేము అన్ని నేర్చుకొని ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాము. సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, అందులో మాది కూడా హిట్ అయితే సంతోషం’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనిని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదే. ప్రభాస్ లో ఇసుమంత గర్వం, ఈగో కూడా లేదు. కొంతమంది ఉంటారు ఎందుకు..అవసరం ఉన్నన్ని రోజులు సందర్భం లేకపోయినా చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు తన ఈవెంట్స్ లో వాడుకుంటారు. రెండు మూడు హిట్స్ వచ్చిన తర్వాత మర్చిపోతారు. నక్కబుద్ధి చూపిస్తారు’ అంటూ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కి కౌంటర్లు ఇస్తున్నారు.
బాగా గమనిస్తే మెగా ఫ్యాన్స్ ఆవేశం లో కూడా ఒక అర్థం ఉంది. ఒకప్పుడు అల్లు అర్జున్ తన ప్రతీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి , పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకుండా ఉండేవాడు కాదు. కానీ సరైనోడు చిత్రం నుండి వాళ్ళిద్దరి గురించి మాట్లాడడం మానేసాడు. పుష్ప 2 తర్వాత అయితే ‘నేను నా అభిమానుల వల్లే ఈరోజు ఇలా ఉన్నాను. ఎవరికైనా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ వస్తారు, నాకు సినిమాల్లోకి రాకముందే ఆర్మీ ఉంది’ అంటూ చెప్పుకునే రేంజ్ కి వచేసాడు అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram