https://oktelugu.com/

Crazy News: బాబోయ్.. ఇదెక్కడ దరిద్రం ? ప్రభాస్ కాస్త చెప్పవయ్యా

Crazy News: సినిమా హీరోల పై కొందరికి పిచ్చి అభిమానం ఉంటుంది. ఉండొచ్చు, కానీ ఆ అభిమానం వెర్రితలలు వేసే విధంగా ఉండకూడదు. అరే.. నచ్చిన హీరో నుంచి అప్ డేట్ రావడం ఆలస్యం అయితే.. ఆత్మహత్య చేసుకుంటాం అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఏమిటి ?, బాబోయ్ అసలు ఇదెక్కడ దరిద్రం..?. పైగా ఆయా డైరెక్టర్లను హీరోలను సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ లో కొందరు అతి […]

Written By:
  • Shiva
  • , Updated On : May 10, 2022 / 04:14 PM IST
    Follow us on

    Crazy News: సినిమా హీరోల పై కొందరికి పిచ్చి అభిమానం ఉంటుంది. ఉండొచ్చు, కానీ ఆ అభిమానం వెర్రితలలు వేసే విధంగా ఉండకూడదు. అరే.. నచ్చిన హీరో నుంచి అప్ డేట్ రావడం ఆలస్యం అయితే.. ఆత్మహత్య చేసుకుంటాం అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఏమిటి ?, బాబోయ్ అసలు ఇదెక్కడ దరిద్రం..?. పైగా ఆయా డైరెక్టర్లను హీరోలను సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ లో కొందరు అతి చేస్తున్నారు.

    prabhas fan letter

    ఆ మధ్య ‘రాధేశ్యామ్’ అప్ డేట్స్ ఇవ్వడం లేదంటూ ఫ్యాన్స్ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సలార్ సినిమా విషయంలో ఏకంగా సూసైడ్ లెటర్లతో బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్ అంటూ ఓ వ్యక్తి ఏకంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కు సూసైడ్ లెటర్ రాశాడు. యాక్షన్ తో విలయతాండవం చేసే ప్రశాంత్ నీల్ కూడా.. అతగాడి పోస్ట్ చూసి భయంతో ఉలిక్కిపడ్డాడు.

    Also Read: Star Heroine: స్టార్ హీరోయిన్ ప్రేమ పాఠాలు.. కుర్రాళ్ళ ఉత్సాహం

    ప్రస్తుతం ఈ సూసైడ్ లెటర్ చర్చనీయాంశంగా మారింది. అసలు ఎటు పోతుంది సమాజం ? ఏమైపోతుంది వాస్తవిక ఆలోచనా విధానం ?. సినిమా అప్ డేట్ కోసం సూసైడ్ చేసుకునే పిచ్చి అభిమానుల వల్ల, సినిమా ఇండస్ట్రీకే నష్టం. అసలు అతగాడు అంతగా ఫీల్ అవ్వడానికి కారణం.. ‘సలార్’ చిత్రాన్ని ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఐతే, కరోనా కారణంగా ఆ ప్లాన్ మారింది.

    ‘కేజీఎఫ్ 2’.. సలార్ ప్లేస్ లోకి వచ్చింది. దాంతో, మేకర్స్ సలార్ కి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ని అధికారికంగా ప్రకటించలేదు, అంతే. మా హీరో సినిమా గురించి మాకే చెప్పవా ? అంటూ ఓ పిచ్చి అభిమాని పిచ్చి పట్టినట్టు సూసైడ్ లెటర్ రాశాడు. పోలీసులు ఎందుకు రాశావురా ? అని అడిగితే.. ‘మే’ నెలలోనే సలార్ నుంచి అప్ డేట్ వస్తుందన్నారు. కానీ, మేకర్స్ నుంచి మాత్రం అప్ డేట్ రావడం లేదు. అందుకే, సూసైడ్ అని ఆ అభిమాని సగర్వంగా చెప్పుకొచ్చాడు.

    salaar movie

    పైగా ‘మా ప్రభాస్ అన్న సలార్ సినిమా గ్లింప్స్ ని, ఈ ‘మే’ నెలలో రిలీజ్ చేయకపోతే ఆత్మహత్య కూడా చేసుకుంటాను అంటూ సదరు వ్యక్తి ప్రశాంత్ నీల్ ను హెచ్చరించాడు. ఇదేం పిచ్చిరా నాయనా ?.. నువ్వు చస్తే నీ ఫ్యామిలీకి కదా నష్టం ? ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకోరా బాబు’ అంటూ అతగాడికి తోటి నెటిజన్లు క్లాస్ లు పీకుతున్నారు. ‘హేయ్.. మీరేంట్రా నాకు చెప్పేది ? నేనింతే’ అన్నట్టు ఉంది ఆ పిచ్చి అభిమాని వ్యవహారం. కనీసం ప్రభాసూ కాస్త నువ్వైనా అతగాడికి చెప్పవయ్యా. ఇంతకీ ఈ అభిమాని చివరకు ఏమైపోతాడో చూడాలి.

    Also Read:Namitha : ఆ ఫొటోలు షేర్ చేసిన నమిత .. చూసి అంతా షాక్.. వైరల్

    Tags