Prabhas Enters OG Universe: భారీ అంచనాల మధ్య ఓజీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు అతని నుంచి ఏదైతే కోరుకున్నారో అంతకు మించిన పవర్ ప్యాక్ పర్ఫామెన్స్ తో ఈ సినిమా రావడం సక్సెస్ టాక్ తెచ్చుకోవడం చకచకా జరిగిపోయాయి. మేజర్ సిటీస్ లో నిజానికి నిన్న రాత్రి నుంచి ఈ సినిమా ప్రీమియర్స్ వేస్తున్నారు…మొదటి ప్రీమియర్ తోనే సక్సెస్ ఫుల్ టాక్ వచ్చింది. దసర పండక్కి మరో వారం రోజుల సమయం ఉన్నప్పటికి ఓజీ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. కాబట్టి ఈ రోజే అసలైన దసర అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ల ముందు రచ్చ రచ్చ చేస్తున్నారు… ఇక ఈ సినిమా దర్శకుడు సుజీత్ మూవీ రిలీజైన సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. సుజీత్ ని ఉద్దేశిస్తూ ఒక రిపోర్టర్ ఓజీ మూవీని సాహో సినిమాతో కనెక్ట్ చేశారు కదా! మరి పవన్ కళ్యాణ్ – ప్రభాస్ కాంబినేషన్లో యూనివర్స్ వస్తోందా? అని అడగగా దానికి దానికి సుజీత్ స్పందిస్తూ ప్రభాస్ అన్న నాకు చాలా మంచి స్నేహితుడు… అతనితో సాహో సినిమా చేసినప్పుడు డైరెక్టర్ గా నేనేం చెప్తే అది తూచా తప్పకుండా ఫాలో అవుతూ నాకు బాగా సపోర్ట్ చేశాడు. కాబట్టే ‘సాహో’ సినిమాను ఆ రేంజ్ లో తీయగలిగాను. ఇక పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయడం అనేది నా చిన్నప్పటి కల…
‘జానీ’ సినిమా నా ఫేవరేట్ మూవీ..ఆ మూవీ చూసిన ప్రతి సారి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే బాగుండు అన్నుకునేవాన్ని.. కానీ ఇప్పుడు ఏకంగా ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చింది. గబ్బర్ సింగ్ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా థియేటర్లో రచ్చ రచ్చ చేసిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాంటి ఒక అభిమానిని అయిన నాకు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అదృష్టం రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం…
అలాగే మా సినిమాకి పాజిటివ్ టాక్ రావడం కూడా శుభపరిణామం అంటూ ఆయన మాట్లాడాడు… పవన్ కళ్యాణ్, ప్రభాస్ లను కలుపుతూ యూనివర్స్ చేస్తానా? లేదా అనే విషయాలను తొందర్లోనే తెలియజేస్తానని చెప్పాడు. ప్రస్తుతం ఓజీ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నానంటూ ఆయన చాలా సంతోషంగా చెప్పారు…
జానీ, తమ్ముడు రిఫరెన్స్ ని వాడుతూ పాటలను రీమిక్స్ ఎందుకు చేశారు అని అడగగా సుజీత్ మాట్లాడుతూ జానీ సినిమా అంటే నాకిష్టం.. అందుకే ఆ మూవీ రిఫరెన్స్ తో ఏదైనా ఒకటి చేయాలని ఆలోచిస్తే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత జానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని అలాగే తమ్ముడు సినిమాలోని ‘ట్రావెలింగ్ సోల్జర్’ సాంగ్ ని సెట్ చేశాను. సినిమా ఫ్లో ను చెడగొట్టకుండా అవి చాలా బాగా కుదిరాయి. సీన్ ఇంటెన్సుని చెడగొట్టకుండా అద్భుతంగా రావడం దానికి థియేటర్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటం చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పాడు…