OG Linked Hollywood Movie: పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓజీ’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది… సుజీత్ దాదాపు మూడు సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. ఆయన పడిన కష్టం మనకు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది…ఆయన కష్టానికి ప్రతిఫలంగా ఈ సినిమాకి మొదటి షో తోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా అగ్రేసివ్ గా కనిపించడమే కాకుండా సినిమా మొత్తం ఒక్కడే వన్ మ్యాన్ షో చేసి మూవీని విజయ తీరాలకు చేర్చాడు అంటూ అతని అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… ఇప్పటివరకు ఈ సినిమా పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుంది… ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా ఇదే ఊపుతో ముందుకు సాగితే దాదాపు 500 కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయి… ప్రస్తుతం న్యూయార్క్ లో ఈ సినిమాని చూసిన చాలామంది జనాలు ఈ సినిమాను ఒక హాలీవుడ్ మూవీతో పోల్చుతున్నారు. సుజీత్ ఆ సినిమా నుంచి స్పూర్తి పొంది ఓజీ కథను రాసుకున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే ‘జాన్ వీక్’… కొన్ని సంవత్సరాల క్రితం హాలీవుడ్ లో వచ్చిన ఈ సినిమా చాలా రికార్డ్స్ ను క్రియేట్ చేసింది.
ఒకరకంగా చెప్పాలి అంటే జాన్ వీక్ కథకి ఓజీ సినిమా కథకి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. ఈ రెండు సినిమాల్లో హీరో మొదట ఒక ఏరియాకి డాన్ గా ఉంటాడు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల అజ్ఞాతంలోకి వెళ్లిపోయి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తన వాళ్లకి ప్రాబ్లం వచ్చిందని తెలుసుకొని వెనక్కి వచ్చి ఆ ప్రాబ్లం ని ఎవరు క్రియేట్ చేశారో వాళ్లని చంపేయడమే ఈ రెండు సినిమాల కథ…
నిజానికి సుజీత్ మీద హాలీవుడ్ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. మేకింగ్ లో గాని, కథల ఎంపికలో గాని ఆయన హాలీవుడ్ సినిమాల రిఫరెన్స్ ని తీసుకుంటున్నాడు. ఒక రకంగా మేకింగ్ లో కొత్తదనం కోసం ఆయన అలా చేయడంలో తప్పులేదు. కానీ కథని మన నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి సినిమా తీస్తే అది అందరికి కనెక్ట్ అవుతోంది.
అలా కాకుండా హాలీవుడ్ సినిమా రేంజ్ లోనే ఇష్టం వచ్చినట్టుగా కథని రాసుకొని సినిమా చేస్తే మాత్రం నింగి విడిచి సాము చేసినట్టుగా అవుతోంది… దానివల్ల ఆ సినిమా మీద కానీ దర్శకుడిగా అతని కెరీర్ మీద కానీ భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉంటాయి… ఇక ప్రస్తుతం సుజీత్ ఓజీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. కాబట్టి తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు అంటూ తన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తొందర్లోనే ఈ విషయాల మీద సరైన క్లారిటీ ఇవ్వడానికి తను సిద్ధమవుతున్నాడు…