Homeఎంటర్టైన్మెంట్Prabhas: ప్రభాస్ డ్రీం రోల్, మూవీ సెట్ అయితే బాహుబలి 2 రిపీట్.. ఇంతకీ ఏమిటా...

Prabhas: ప్రభాస్ డ్రీం రోల్, మూవీ సెట్ అయితే బాహుబలి 2 రిపీట్.. ఇంతకీ ఏమిటా రోల్?

Prabhas: రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ప్రభాస్ విభిన్న పాత్రలు చేశారు. గ్యాంగ్ స్టర్, పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్, ఎపిక్ యాక్షన్, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ జోనర్స్ ట్రై చేశాడు. రాముడిగా నటించిన ఈ తరం ఏకైక టాలీవుడ్ హీరో ప్రభాస్ కావడం విశేషం. ఇతర పరిశ్రమలకు చెందిన పలువురు స్టార్స్ కి సైతం అవకాశం దక్కలేదు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బాల్యంలో చేశారు. ఇన్ని రకాల పాత్రలు చేసిన ప్రభాస్ డ్రీమ్ రోల్ మాత్రం వేరొకటి ఉంది. ఆ కోరిక తీరలేదు.

ప్రభాస్ డ్రీమ్ రోల్ ఛత్రపతి శివాజీ అట. మరాఠా యోధుడిగా పిలుచుకునే ఛత్రపతి శివాజీ మహరాజ్ బోన్స్లే డైనస్టీకి చెందిన రాజు. ఆయన మొఘలులు, హైదరాబాద్ నవాబులు, ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాడారు. ఆయన వీరోచిత గాధ సిల్వర్ స్క్రీన్ పై పలువురు ఆవిష్కరించారు. శివాజీ బయోపిక్ గా పీరియాడిక్ వార్ డ్రామా చేయాలనేది ప్రభాస్ కోరిక. శివాజీ జీవితాన్ని అద్భుతమైన సినిమాటిక్ సబ్జెక్టుగా మార్చి స్క్రిప్ట్ సిద్ధం చేస్తే మూవీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారట.

అయితే ఆ సబ్జెక్టు తో ప్రభాస్ ని ఎవరూ కలవలేదని సమాచారం. కలిసినా స్క్రిప్ట్ నచ్చితేనే ప్రభాస్ చేస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడైన ప్రభాస్.. శివాజీ గెటప్ లో ఓ రేంజ్ లో ఉంటాడు అనడంలో సందేహం లేదు. మంచి డైరెక్టర్ తో శివాజీ బయోపిక్ ప్రభాస్ కి పడాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్.. రాజా సాబ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఫౌజీ, స్పిరిట్ చిత్రాలు త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాయట.

కల్కి 2, సలార్ 2 చిత్రాలు సైతం ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాల జాబితాలో ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్స్ పట్టాలెక్కేందుకు చాలా సమయం ఉన్నట్లు సమాచారం. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి ప్రభాస్ కి భారీ హిట్ ఇచ్చింది. ఆయన రేంజ్ వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ కల్కి మూవీ రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక దేశంలోనే నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular