https://oktelugu.com/

Prabhas : వాయనాడ్ కు ప్రభాస్ భారీ విరాళం.. మిగతా స్టార్స్ ఎంత సాయం చేశారంటే?

ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మరింత మంది సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 7, 2024 / 06:31 PM IST

    Wayanad Victims, Prabhas

    Follow us on

    Prabhas : కేరళలోని వాయనాడ్ వరద కూపంలో కూరుకుపోయింది. ఇటీవల సంబంధించిన వరదల కారణంగా కొండచరియలు విరిగి పడి 2 వేల మంది మరణించినట్లు తెలుస్తోంది. దాదాపు వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ కొన్ని చోట్ల మృతదేహాలు బయటపడడం చూసి కొందరు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనలో గల్లంతైన వారి కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు. వీరి కోసం కేంద్ర బలగాలతో పాటు వివిధ సంస్థలకు చెందిన వారు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేరళ వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఇక్కడ సంభవించిన వరదలతో వేల ప్రాణాలు పోగా.. లెక్కలేనన్ని ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో కొందరు బాధితులను వివిధ సురక్షిత ప్రదేశాలకు తరలించి వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. కేరళకు ఇలాంటి విపత్తులు కొత్తేమీ కాదు. అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వంతో పాటు ప్రముఖ వ్యక్తులు విరాళాలు ఇస్తుంటారు. వీరిలో ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారు తమ ఉదారత చాటుకుంటున్నారు. అయితే దేశంలో ఎక్కడ విపత్తు జరిగినా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు సహాయం చేయడంలో ముందు ఉంటారు. ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు అగ్ర హీరోలు తమ విరాళాన్ని ప్రకటించారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ లతో పాటు పలువురు ఉన్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కేరళ బాధితులకు సాయం ప్రకటించారు. ప్రభాస్ చేసిన సాయం ఎంతంటే?

    వరద బాధితులకు సాయం చేయడంలో తెలుగు ఇండస్ట్రీ ముందు ఉంటుంది. గతంలో విశాఖ విపత్తు సమయంలో బాధితులకు సాయం ప్రకటించడమే కాకుండా దగ్గరుండీ కొన్ని వస్తువులను బాధితులకు అందజేశారు. అయితే ప్రస్తుతం కేరళ సీఎం ఫండ్ కు విరాళం ప్రకటించారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో చిరంజీవి, రామ్ చరన్ కలిపి రూ. కోటి విరాళం ప్రకటించారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు కేరళలో కూడా ఎక్కవగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కొన్ని చిత్రాలు కేరళలో చిత్రీకరించబడ్డాయి కూడా ఈ నేపథ్యంలో కేరళలోని వయనాడు పరిస్థితి చూసి చలించిపోయారు. దీంతో ఆయన రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. అంతేకాకుండా కొన్ని రోజుల పాటు ఆయన సినిమా కార్యక్రమాలను నిలిపివేసుకున్నారు.

    తాజాగా రెబల్ స్టార్ అందరి కంటే ఎక్కువగా రూ. 2 కోట్ల విరాళం ప్రకటించారు. బాహుబలి తరువాత ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కేరళలోనూ ఆయనను ఆదరించేవారు లేకపోలేదు. ఈ నేఫథ్యంలో కేరళ పరిస్థితి చూసిన ప్రభాస్ తన వంతుగా రూ. 2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మరింత మంది సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

    తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు సౌత్ సినిమా అంతా వాయనాడ్ కు సాయం చేయాలని ఏకం అయింది. ఇప్పటికే మాలివుడ్ కు చెందిన మోహన్ లాల్, మమ్ముట్టి, నయనతార అండంగా ఉండేందుకు ముందుకు వచ్చారు. తమిళ ఇండస్ట్రీకి చెందిన సూర్య, జ్యోతికలువిరాళం ప్రకటించారు. ఇలా సినీ ఇండస్ట్రీ మొత్తం వయనాడ్ కు సాయం చేసేందుకు కదిలి వస్తోంది. అదీ కాకుండా కొందరు సినీ సెలబ్రెటీలు నేరుగా సాయం చేయడానిి రెడీ అవుతున్నారు. ప్రత్యక్షంగా బాధితులను కలుసుకొని వారికి సాయం చేయనున్నారు.