Prabhas Darling Movie Costumes: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న వారిలో ప్రభాస్ ఒకరు…ఆయన చేస్తున్న సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం ఆయన ఫౌజీ, స్పిరిట్ లాంటి సినిమాలను చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికే రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు… రీసెంట్ గా ప్రభాస్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తను డార్లింగ్ సినిమాలో వేసుకున్న లూస్ డ్రస్ గురించి క్లారిటీ ఇచ్చాడు… మొదట ప్రభాస్ ఆ కాస్ట్యూమ్స్ వేసుకున్నప్పుడు చాలా లూస్ గా ఉన్నాయని సినిమా యూనిట్ చాలా మంది కామెంట్స్ చేశారట.
కానీ దాన్ని స్టైలిష్ గా మార్చడంలో ప్రభాస్ సక్సెస్ అయ్యాడు. ఆ టీషర్ట్లు షోల్డర్ మీద నుంచి జారిపోతుంటే పైకి అనుకోవడం అలాగే పాయింట్ ని పైకి లాగడం లాంటివి చాలా స్టైలిష్ గా మారాయి. ఆ తర్వాత కాలంలో కూడా అతని స్టైల్ ని అనుసరిస్తూ అతను అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఆ కాస్ట్యూమ్స్ ని కొనుగోలు చేశారు అంటే మామూలు విషయం కాదు.
అయితే దీనికి సంబంధించిన సీక్రెట్ ని కూడా ప్రభాస్ రివిల్ చేశాడు. చాలామంది ప్రభాస్ అలాంటి డ్రెస్ వేసుకుంటే బాగుండదని కామెంట్స్ చేసిన కూడా సినిమా రిలీజ్ అయ్యాక అదే స్టైల్ గా మారిపోయింది. డార్లింగ్ సినిమాను ప్రభాస్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఆయన ఆ సినిమాలో కామెడీ చేస్తూనే యాక్షన్ ఎపిసోడ్స్ లో సైతం తన సత్తా చాటుకున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… తను కూడా ఇక మీదట రాబోయే సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు…మరి తను అనుకున్నట్టుగానే వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
View this post on Instagram
