Prabhas and Trivikram: ప్రస్తుతం సలార్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ మారుతి తో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నాడు, ఇక అలాగే నాగ్ అశ్విన్ తో కల్కి అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ ఈ రెండు సినిమాలు కూడా ఈ సంవత్సరం ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సంవత్సరంలో తను బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసి భారీ వసూళ్ళను కలెక్ట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఎప్పటినుంచో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే త్రివిక్రమ్ మాత్రం వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రభాస్ ని మాత్రం పట్టించుకోకుండా ముందుకు కదులుతున్నాడు. ఇక దానికి కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియనప్పటికీ వీళ్ళ కాంబినేషన్ లో మాత్రం సినిమా అయితే రావడం లేదు. అయితే త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ప్రభాస్ ఎప్పటినుంచో అసక్తి చూపిస్తున్నాడు, కానీ త్రివిక్రమ్ మాత్రం ఎప్పుడూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో సినిమాలు చేస్తూ కాలం గడిపేస్తున్నాడు.
ఇక ప్రభాస్ అభిమానులు కూడా త్రివిక్రమ్ తో సినిమా ఉంటే బాగుండేది అని చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ చేసిన గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయింది. అయినప్పటికీ త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ ప్రభాస్ అభిమానులు మా హీరోతో మీ సినిమా ఎప్పుడు ఉంటుంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన పోస్ట్ లు పెడుతున్నారు. ఇక దాంతో ఎలాగైనా సరే త్రివిక్రమ్ ప్రభాస్ కాంబో సెట్ చేయాలనే ఉద్దేశ్యం లో కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు కొంత మంది ప్రొడ్యూసర్లు ఈ కాంబినేషన్ సెట్ చేసి పెద్ద ఎత్తున హిట్ కొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మొత్తానికైతే వచ్చే సంవత్సరం ఈ సినిమా పాజిబుల్ అయ్యే విధంగా కనిపిస్తుంది… చూడాలి మరి త్రివిక్రమ్ ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో