Salaar Movie Teaser: మైండ్ బ్లోయింగ్ అప్డేట్…. సలార్ టీజర్ టైం అండ్ డేట్ ఫిక్స్డ్!

సలార్ కెజిఎఫ్ ప్రాంచైజీలో భాగమే. ఆ కథతో సంబంధం ఉన్న చిత్రమే అని ప్రచారం జరుగుతుంది. దీనిపై మేకర్స్ స్పష్టత ఇవ్వడం లేదు. ఆ విషయం థియేటర్లో సలార్ చూసి తెలుసుకోండి అంటున్నారు.

Written By: Shiva, Updated On : July 3, 2023 3:42 pm

Salaar Movie Teaser

Follow us on

Salaar Movie Teaser:  ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాల్లో భారీ హైప్ నెలకొన్న చిత్రం సలార్. కెజిఎఫ్ సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్ర దర్శకుడు కావడంతో అంచనాలు ఆకాశానికి చేరాయి. ప్రభాస్ వంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న మాస్ హీరోతో ఆయన చిత్రం ఓ రేంజ్ లో ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. కెజిఫ్ సిరీస్ కి మించి సలార్ ఉంటుందనే భావన అందరిలో ఉంది. అందుకే సలార్ ప్రతి అప్డేట్ జనాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెడుతుంది.

సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. విడుదలకు వంద రోజుల సమయం కూడా లేదు. అందుకే ప్రమోషన్స్ షురూ చేశారు. సలార్ టీజర్ విడుదల తేదీ ప్రకటించారు. జులై 6న సాయంత్రం 5:12 నిమిషాలకు టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ఐదు భాషల్లో సలార్ టీజర్ పెద్ద ఎత్తున విడుదల కానుంది. కెజిఎఫ్ 2 టీజర్ భారీ రికార్డు నెలకొల్పిన నేపథ్యంలో సలార్ ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా అనే ఆసక్తి మొదలైంది.

సలార్ కెజిఎఫ్ ప్రాంచైజీలో భాగమే. ఆ కథతో సంబంధం ఉన్న చిత్రమే అని ప్రచారం జరుగుతుంది. దీనిపై మేకర్స్ స్పష్టత ఇవ్వడం లేదు. ఆ విషయం థియేటర్లో సలార్ చూసి తెలుసుకోండి అంటున్నారు. ఈ క్రమంలో ఒక సస్పెన్సు అయితే కొనసాగుతుంది. ఈ సినిమాలో అధికభాగం తెలంగాణలో గల గోదావరి ఖని బొగ్గు గనుల్లో చిత్రీకరించారు. ఈ చిత్ర కథ ఏమై ఉంటుందనే ఉత్కంఠ అందరిలో ఉంది.

కెజిఎఫ్ మేకర్స్ సలార్ నిర్మాతలుగా ఉన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తున్నారు. కెరీర్లో ఫస్ట్ టైం శృతి హాసన్-ప్రభాస్ కలిసి నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ మూవీ పడలేదు. సలార్ అందరి దాహం తీర్చే మూవీ అవుతుందని నమ్ముతున్నారు.