
మల్టీస్టారర్స్ కాన్సెప్ట్ ఇప్పటిది కాదు. బాలీవుడ్‌లో ఇప్పుడు మల్టీస్టారర్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. ఇప్పుడది సక్సెస్ ఫార్ములాగా మారింది. దక్షిణాదిలోనూ తరచూ మల్టీస్టారర్స్ వస్తున్నాయి. తమిళ్, కన్నడ, మలయాళంలో వాటి పరిధి పెరిగింది. కానీ, తెలుగులో ఇప్పుడిప్పుడే మల్టీస్టారర్ మూవీ వస్తున్నాయి. కానీ, ఏడాదికి ఒకటో రెండో వస్తున్నాయి. అవీ యువ హీరోలవే. వెంకటేశ్ మినహా పెద్ద స్టార్లు ఎవ్వరూ ఇతర స్టార్లతో తెర పంచుకునేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. తమ ఇగో, ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్లను మెప్పించే కథలు లేకపోవడం దానికి కారణం. అయితే, 1970, 80 దశకాల్లో చివరకు 90ల వరకూ తెలుగులో మల్టీస్టారర్ల హవా నడించింది. అప్పట్లో అగ్ర నటులుగా వెలుగొందిన ఎన్టీఆర్, ఏఎన్నార్కలిసి ఎన్నో పౌరాణిక, కమర్షియల్ చిత్రాల్లో నటించారు. అవన్నీ మంచి విజయాలు కూడా సాధించాయి. ప్రస్తుతం ఎస్‌ఎస్ రాజమౌళి… జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీస్టారర్చిత్రం తీస్తున్నాడు. ఇప్పుడు దిల్ రాజు కూడా ఇలాంటి ఓ భారీ చిత్రం తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో హీరోలుగా ప్రభాస్, అల్లు అర్జున్‌ను తీసుకోవాలని చూస్తున్నాడట.
Also Read: బన్నీ- కొరటాల.. భరత్ అనే నేను ఫార్ములా
డార్లింగ్, బన్నీతో ఆర్ఆర్ఆర్ ను మించిన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్ రాజు భావిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రభాస్ ఇదివరకే దిల్ రాజుకు డేట్స్ ఇచ్చాడు. కానీ, వివిధ కారణాల వల్ల వీరిద్దరి సినిమా వర్కౌట్ కాలేదు. అలాగే, డీజే తర్వాత బన్నీ కూడా దిల్ రాజుతో మరో సినిమా చేయాల్సి ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో ఐకాన్ అనే సినిమాను కూడా ప్రకటించారు. కానీ, దీన్ని పక్కనపెట్టారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ మల్టీస్టారర్ కోసం ప్రభాస్, బన్నీని ఒక్కటి చేయాలని ఈ బడా నిర్మాత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’లో నటిస్తున్నాడు. దీని తర్వాత నాగ్ అశ్విన్‌తో ఓ సినిమా, ఓం రౌత్ డైరెక్షన్‌లో ఆదిపురుష్ కూడా చేయాల్సి ఉంటుంది. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో బన్నీ ‘పుష్ప’లో నటిస్తున్నాడు. అలాగే, కొరటాల శివతో తన కొత్త ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేశాడు.
Also Read: సూపర్ హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కి సినిమా లేదు !
ప్రభాస్, బన్నీ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయ్యే సరికి కనీసం రెండేళ్లు పట్టేలా ఉంది. ఆ తర్వాతే ఈ ఇద్దరి కాంబినేషన్లో మల్టీస్టారర్ను పట్టాలెక్కించాలని దిల్ రాజు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నాడు. ప్రభాస్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిపోగా… సౌతిండియాలో ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాటు కొరటాలతో సినిమాను హిందీలో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఒకవేళ ప్రభాస్, బన్నీ మల్టీస్టారర్ ఓకే అయితే మాత్రం ఇద్దరి ఫ్యాన్స్‌కు పండగే. అలాగే, ఇండియా లెవెల్లో ఇదో భారీ చిత్రం కానుంది.