Adipurush Song: ఆదిపురుష్ తో బాహుబలి రికార్డ్స్ బద్దలు..? ఆకాశానికి చేరుతున్న అంచనాలు!

Adipurush Song: మొన్నటి వరకు ఆదిపురుష్ మూవీపై కనీస అంచనాలు లేవు. ఇప్పుడు ఏకంగా బాహుబలి రికార్డ్స్ బద్దలు కొడతామని ప్రభాస్ ఫ్యాన్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ నుండి వస్తున్న ఒక్కో అప్డేట్ దీనికి కారణం అవుతుంది. చెప్పాలంటే ఆదిపురుష్ మూవీ తీవ్ర విమర్శల పాలైంది. టీజర్ చూసిన జనాలు షాక్ అయ్యారు. సినిమాలో కనీస ప్రమాణాలు లేవని వాపోయారు. నాసిరకం గ్రాఫిక్స్ కార్టూన్ మూవీస్ ని తలపించాయి. ఇక ప్రధాన పాత్రల లుక్స్ ఆడియన్స్ […]

Written By: Shiva, Updated On : May 22, 2023 12:46 pm

Adipurush Song

Follow us on

Adipurush Song: మొన్నటి వరకు ఆదిపురుష్ మూవీపై కనీస అంచనాలు లేవు. ఇప్పుడు ఏకంగా బాహుబలి రికార్డ్స్ బద్దలు కొడతామని ప్రభాస్ ఫ్యాన్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ నుండి వస్తున్న ఒక్కో అప్డేట్ దీనికి కారణం అవుతుంది. చెప్పాలంటే ఆదిపురుష్ మూవీ తీవ్ర విమర్శల పాలైంది. టీజర్ చూసిన జనాలు షాక్ అయ్యారు. సినిమాలో కనీస ప్రమాణాలు లేవని వాపోయారు. నాసిరకం గ్రాఫిక్స్ కార్టూన్ మూవీస్ ని తలపించాయి. ఇక ప్రధాన పాత్రల లుక్స్ ఆడియన్స్ కి నచ్చలేదు. వివాదస్పదం అయ్యాయి. సాంప్రదాయ వేషధారణలకు భిన్నంగా హనుమంతుడు, రావణాసురుడు పాత్రలను చూపించారు.

రావణాసురుడిని హాలీవుడ్ చిత్రాల విలన్ గెటప్ లో చూసి హిందూ వర్గాలు మండిపడ్డాయి. అసలు ఓమ్ రౌత్ కి రామాయణం తెలుసా? రావణుడు శివ భక్తుడు. ఆయన్ని ఇష్టం వచ్చినట్లు చూపిస్తారా? ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజర్ పై విమర్శల నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి మూవీపై నమ్మకం పోయింది. యూనిట్ ఆదిపురుష్ చిత్ర విడుదల ఆరు నెలలు వాయిదా వేశారు. ఆదిపురుష్ 2023 సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది.

ఈ ఆరు నెలల్లో తప్పులు సరిచేసుకొని సిద్ధమయ్యారు. ట్రైలర్ తో అంచనాలు మార్చేశారు. అప్పటి వరకు ఉన్న అపోహలు పటాపంచలు చేశారు. ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. మనం అనుకున్నంత దారుణంగా మూవీ ఉండకపోవచ్చు. ట్రైలర్ బాగుంది. ఆదిపురుష్ థియేటర్స్ లో మ్యాజిక్ చేసే అవకాశం కలదని పలువురు నమ్ముతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జై శ్రీరామ్ అనే వీడియో సాంగ్ విడుదల చేశారు. ఇది మరింతగా ఆకట్టుకుంది. మొత్తంగా ఆదిపురుష్ పూర్తి నెగిటివిటీ నుండి పూర్తి పాజిటివిటీకి మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఏకంగా బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తామంటున్నారు. మరి వారి నమ్మకం ఈ మేరకు నిజవుతుందో చూడాలి. ఆదిపురుష్ మూవీలో కృతి సనన్ హీరోయిన్. ఆమె సీత పాత్ర చేస్తున్నారు. ఇక రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. జూన్ 16న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో ఆదిపురుష్ విడుదల కానుంది.