Adipurush Review: ‘ఆదిపురుష్’ మూవీ ఫుల్ రివ్యూ

సినిమా ప్రారంభం విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా టైటిల్ కార్డ్స్ పాడేటప్పుడు యానిమేటడ్ శ్రీ మహా విష్ణువు విజువల్స్ అద్భుతంగా అనిపించింది.

Written By: Vicky, Updated On : June 16, 2023 1:19 pm

Adipurush Review

Follow us on

Adipurush Review: నటీనటులు : ప్రభాస్ , కృతి సనన్ , సైఫ్ అలీ ఖాన్, దేవ్ దత్త నాగే, సన్నీ సింగ్ తదితరులు
దర్శకత్వం : ఓం రౌత్
సంగీతం : సంచిత్ బల్హార, అంకిత్ బల్హార
బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ

టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ , కోలీవుడ్ మరియు మాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూసిన చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్, భారతీయులు ఆరాధ్య దైవం గా భావించే శ్రీ రాముని పాత్ర పోషిస్తున్నాడు అంటే కచ్చితంగా అంచనాలు తారాస్థాయిలో ఉండడం సహజం. కానీ ఎప్పుడైతే టీజర్ వచ్చిందో, అందులో కార్టూన్ తరహా VFX ని చూసి అప్పట్లో ఘోరమైన ట్రోల్ల్స్ వచ్చాయి. ఆ నెగటివ్ కామెంట్స్ ని తట్టుకోలేక మేకర్స్ ఈ చిత్రం VFX పై మరోసారి పూర్తి స్థాయి రీ వర్క్ చేసి ప్రమోషనల్ కంటెంట్ ని వదిలారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇక ఆ తర్వాత విడుదలైన పాటలకు కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. అలా చూస్తూ ఉండగానే ఈ చిత్రం పై అంచనాలు ఎవ్వరూ అందుకోలేని రేంజ్ కి వెళ్ళింది. నేడు ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మరి ఈ చిత్రం ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.

కథ :

దశరథ మహారాజు (ప్రభాస్) వృద్దాప్యం లో ఇక రాజ్యపాలన నుండి విముక్తుడై తన పెద్ద కొడుకు రాఘవ్ (ప్రభాస్) ని అయోధ్య మహానగరం కి రాజుని చేసి పట్టాభిషిక్తుడిని చెయ్యాలని అనుకుంటాడు.కానీ దశరథ మహారాజు రెండవ భార్య కైకేయి మాత్రం రాఘవ్ కి బదులుగా తన కుమారుడు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని పట్టుబడుతుంది. అంతే కాదు భరతుడికి పట్టాభిషేకం తో పాటుగా , రాఘవుడికి 14 ఏళ్ళ వనవాసం కూడా విధించాలని కోరుతుంది.దశరథుడు ఆజ్ఞ ప్రకారం రాఘవ్ తన భార్య జానకి( కృతి సనన్) మరియు లక్ష్మణుడితో కలిసి వనవాసం చేస్తాడు. అలా వనవాసం చేస్తున్న రోజుల్లో సూర్పనక్క లక్ష్మణుడిని వరిస్తుంది.కానీ లక్ష్మణుడికి ఇష్టం లేదు,దీనితో పగ పెంచుకున్న సూర్పనక్క తన రాక్షస సైన్యం తో దాడులు చేయిస్తుంది, ఈ దాడిలో సీతకి గాయాలు అవుతాయి. దాంతో ఆగ్రహించిన లక్ష్మణుడు సూర్పనక్క ముక్కుని కోసేస్తాడు.ఇది వెళ్లి తన అన్నయ్య లంకేశ్ కి(సైఫ్ అలీ ఖాన్) చెప్పుకోగా, లంకేశ్ ఆవేశం తో రగిలిపోయి భిక్షువు రూపం లో వచ్చి జానకిని అపహరించుకొని లంకకి తీసుకెళ్లి అశోక వనం లో బంధిస్తాడు. అప్పుడు రాముడు రావణాసురుడిని జయించి సీతని ఎలా తీసుకొచ్చాడు ..?, అందుకు వానరసైన్యం ఎలాంటి సహాయం చేసింది అనేది వెండితెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ :

సినిమా ప్రారంభం విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా టైటిల్ కార్డ్స్ పాడేటప్పుడు యానిమేటడ్ శ్రీ మహా విష్ణువు విజువల్స్ అద్భుతంగా అనిపించింది. ఇక ప్రభాస్ ఇంట్రడక్షన్ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు.విజువల్స్ మొత్తం గ్రాండియర్ గా అద్భుతంగా అనిపించాయి. ఇక తర్వాత వచ్చిన ‘రామ్ సీత రామ్’ పాట, రావణాసురుడు సీతని అపహటించే సన్నివేశం చాలా చక్కగా తీసాడు. ఈ సన్నివేశాలన్నిటికి విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా కుదిరింది. కానీ మిగిలిన సన్నివేశాలకు VFX చాలా నాసిరకంగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి డ్రామాతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాము కానీ, VFX మాత్రం పైన చెప్పిన సన్నివేశాలకు తప్ప , మిగిలింది మొత్తం చాలా దారుణంగా అనిపించింది. రామాయణం గురించి పసి పిల్లల దగ్గర నుండి పండుముసలి వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరికి తెలుసు, మళ్ళీ అదే కథతో తీస్తున్నారు అంటే కచ్చితంగా గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండాలి, అప్పుడే ఆడియన్స్ థియేటర్స్ కి కదులుతారు, ఈ సినిమాలో మిస్ అయ్యింది అదే.

కానీ డ్రామా పండింది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చే అవకాశం ఉంది. ఇక సెకండ్ హాఫ్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగానే ఉంది కానీ, ఇక్కడ కూడా విజువల్ ఎఫెక్ట్స్ ఆడియన్స్ కి కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తుంది. ముఖ్యంగా రావణాసురిడి పది తలలు చూపించిన విధానం కి మాటలు లేవు మాట్లాడుకోడాలు లేవు..అంత దరిద్రంగా ఇప్పటి వరకు రావణాసురుడిని ఏ డైరెక్టర్ కూడా చూపించలేదు.ఓం రౌత్ ఏ ఉద్దేశ్యం తో రావణుడిని అలా చూపించాడో ఎవరికీ అర్థం కాలేదు. అంతే కాదు ఈ చిత్రం లో రాముడిని రాఘవ్ అని, సీత ని జానకి అని , రావణాసురుడి ని లంకేశ్ అనే పేర్లతో ఎందుకు పిలిపించాడో కూడా అర్థం కాదు.ఇక ప్రభాస్ లుక్స్ బాగాలేకపోయిన , నటన పరంగా మంచి మార్కులే కొట్టేసాడు. కానీ ఆయన లుక్స్ మాత్రం క్లోజప్ షాట్స్ లో చాలా వరస్ట్ గా ఉన్నాయి, డబ్బింగ్ కూడా సరిగా చెప్పలేదు అని అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత , ఇక సీత పాత్రలో కృతి సనన్ జీవించింది, రావణుడి పాత్ర లో సైఫ్ అలీ ఖాన్ పర్వాలేదు అనిపించాడు, ఇక ఈ చిత్రానికి ఆయువు పట్టులాగా నిల్చింది ఏదైనా ఉందా అంటే అది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి.

చివరి మాట :

VFX మీద భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే , టేకింగ్ పరంగా ఈ చిత్రం ప్రతీ ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. బాక్స్ ఆఫీస్ పరంగా ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి మరి .

రేటింగ్ : 2.75 /5
Recommended Video: