Adipurush First Review
Adipurush First Review: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ వచ్చే నెల 16 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా అతి త్వరలోనే పాల్గొన బోతున్నాడు ప్రభాస్, జూన్ 6 వ తారీఖున హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఏర్పాటు చెయ్యబోతున్నారు.
ఇప్పటికీ ఈ చిత్రం నుండి విడుదలైన ‘జై శ్రీ రామ్’ అనే పాట సెన్సేషన్ సృష్టించింది. సోషల్ మీడియా లో కానీ , బయట కానీ ఎక్కడ చూసిన ఈ పాటనే వినపడుతుంది. దానికి తోడు రీసెంట్ గానే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్ కి ప్రశంసల వర్షం కురిసింది. టీజర్ అప్పుడు గ్రాఫిక్స్ విషయం ఏ రేంజ్ విమర్శలు వచ్చాయో, ట్రైలర్ కి ఆ రేంజ్ ప్రశంసలు వచ్చాయి.
ఇక ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ సిద్ధం అయిపోయిందట, రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో దర్శక నిర్మాతలు దిల్ రాజు తో కలిసి ఫైనల్ ఔట్పుట్ చూసారు.వాళ్ళ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. అనుకున్న దానికంటే అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, రామాయణం పై ఇది వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి.కానీ ఇందులో రామాయణం ని గ్రాండ్ స్కేల్ లో సరికొత్త టెక్నాలజీ తో చూపించారని, కచ్చితంగా ఆడియన్స్ కి ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుందని దిల్ రాజు చెప్పాడట.
ఇక ఈ సినిమా 3D వెర్షన్ కూడా అన్నీ బాషలలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. 3D వెర్షన్ చూసే ఆడియన్స్ కి మనం రామాయణం ప్రపంచం లోకి ఆడుగుపెట్టామా? అనే అనుభూతి కలుగుతుందట, వెండితెర మీద శ్రీరాముని వైభోగం ని ఎలా అయితే చూడాలని రామ భక్తులు కోరుకున్నారో, అంతకు మించి ఉందట ఈ సినిమా, ఇదే కనుక నిజమైతే ఈ చిత్రం కేవలం బాలీవుడ్ నుండే వెయ్యి కోట్లు రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.