https://oktelugu.com/

Adipurush Collections: ‘ఆదిపురుష్’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఆ ప్రాంతం లో థియేటర్ రెంట్స్ కూడా రీ కవర్ అవ్వడం లేదా!

500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ని పెట్టి ఇలాంటి వసూళ్లు చూడడానికా సినిమాలు తీసింది అంటూ కొంతమంది నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : June 22, 2023 / 12:03 PM IST

    Adipurush Collections

    Follow us on

    Adipurush Collections: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి మూడు రోజులు టాక్ తో సంబంధం లేకుండా కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ ని రాబట్టిన ఈ సినిమా, నాల్గవ రోజు నుండి మాత్రం దారుణంగా డ్రాప్ అయ్యింది. కనీసం ప్రాంతీయ బాషా చిత్రానికి వచ్చిన వసూళ్లు కూడా ఈ సినిమాకి రావడం లేదు.

    500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ని పెట్టి ఇలాంటి వసూళ్లు చూడడానికా సినిమాలు తీసింది అంటూ కొంతమంది నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. ‘ఆదిపురుష్’ కి ముందు కూడా ప్రభాస్ నటించిన రెండు సినిమాలు ఇలాగే ఆడాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి ఆరు రోజులకు కలిపి ఎంత వసూళ్లు వచ్చాయో , ఆరవ రోజు ఎంత కలెక్ట్ చేసింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఆరవ రోజు కేవలం కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. నైజాం ప్రాంతం లో చాలా చోట్ల రెంటల్ బేసిస్ మీద నడుస్తున్న థియేటర్స్ లో ఈ చిత్రం డైలీ థియేటర్ రెంట్స్ ని కూడా నిన్న రాబట్టలేకపోయిందట.

    ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కలెక్షన్స్ తగ్గగానే మెజారిటీ థియేటర్స్ కమిషన్ బేసిస్ మీదనే నడిచేవి, కాబట్టి అక్కడ ఎక్కువగా నష్టాలు రాకపోవచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఈ సినిమా ఆరు రోజులకు కలిపి 159 కోట్ల రూపాయిల షేర్ మరియు మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసి ఆల్ టైం టాప్ 4 తెలుగు మూవీస్ లో ఒకటిగా నిలిచింది. మరి ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూద్దాం, ఈ వీకెండ్ పై బయ్యర్స్ భారీ గానే ఆశలు పెట్టుకున్నారు.