Homeఎంటర్టైన్మెంట్Mahesh: మహేశ్​ కుటుంబానికి పవన్​ దీపావళి కానుక.. అందులో ఏముందంటే!

Mahesh: మహేశ్​ కుటుంబానికి పవన్​ దీపావళి కానుక.. అందులో ఏముందంటే!

Mahesh: పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​కు టాలీవుడ్​లో ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, మహేశ్​బాబుకు కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. వరుస విజయాలతో ప్రస్తుతం అగ్రహీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్​లో ఒక్క సినిమా అయినా చూడాలని వారి అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. వీరిద్దరు ఎప్పుడైనా కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం చాలా సార్లు చూశాం. తాజాగా, దీపావళి సందర్భంగా పవన్​ కల్యాణ్​- మహేశ్​ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

పండుగను పురస్కరించుకుని పవన్​ సినీ ఇండస్ట్రీలో ఆప్తులైన వారికి కానుకలు పంపించారు. ఈ క్రమంలోనే మహేశ్​ బాబు కుటుంబానికీ గిఫ్ట్ పంపించారు. ఇందులో పర్యావరణానికి హాని చేయని టపాసులతో పాటు కొన్ని మిఠాయిలూ ఉన్నాయి. ఈ విషయాన్ని మహేశ్ భార్య నమ్రత సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తూ తెలియజేసింది. ఇంత విలువైన కానులు పంపించినందుకు ధన్యవాదాలు తెలిపింది.

pawan kalyan

 

మహేశ్​తో పాటు దర్శకులు హరీశ్​ శంకర్​, క్రిష్​లు కూడా పవన్​కు విషెస్​ చెప్తూ ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్​ బిజీగా గడుపుతున్నారు పవన్​.  భీమ్లానాయక్​, హరిహర వీరమల్లు సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఇక మహేశ్​ సర్కారు వారి పాట సినిమా షూటింగ్​ను దాదాపు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఏప్రిల్​లో మహేశ్​ ప్రేక్షకుల ముందుకు రానుండగా… భీమ్లనాయక్ మాత్రం సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular