Pawan Kalyan: సినీ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు జాతకాలను , శాస్త్రాలను నమ్మే వాళ్ళు ఎక్కువ గానే ఉంటారు. ఆయా రంగాల్లో ఉండే వ్యక్తుల ఏ పని చేయాలన్న ముందుగా ముహూర్తాలు అవి ఇవి చూసుకునే చేస్తారు. అదే విధంగా తమ జాతకలకు తగ్గట్టు పరిహారాలు, పూజలు అలాగే లోహ సంబంధమైన వస్తువులు ధరిస్తారు. సినీ, రాజకీయ రంగాల్లో ఇలాంటి వారిని అనేక మందిని చూశాం.
తాజాగా టాలీవుడ్ అగ్ర హీరో , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన చేతికి ఉన్న రెండు ఉంగరాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ను బాలకృష్ణ, ఆయన అల్లుడు నారా లోకేష్ తో కలిసి ములాఖత్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయి అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఆ సమయంలో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ మీద ఎంత మంది దృష్టి ఉందో, అదే సమయంలో ఆయన చేతికి ఉన్న ఉంగరాల మీద అనేక మంది దృష్టి ఉంది. జనసేనాని చేతికి తాబేలు, నాగ అంగుళీకాలు(ఉంగరాలు ) ఉన్నాయి. అదే విధంగా పవన్ చేతికి పగడం ఉంగరం కూడా ఉంటుంది. దానిని ప్రతి మంగళ లేదా శని వారాల్లో దరిస్తాడట. దీనితో అసలు ఆ ఉంగరాలు ఎందుకు..? వాటిని పవన్ కళ్యాణ్ ఎందుకు ధరిస్తున్నారు అనే సందేహాలు మొదలయ్యాయి.
కూర్మ (తాబేలు ) ఉంగరం ధరిస్తే అది అధికార యోగం తో పాటుగా ధన యోగం కూడా లభించేలా చేస్తుందనేది నమ్మకం. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ కావాలనే కోరిక తో ఆ ఉంగరం ధరించి ఉండవచ్చు. ఇక నాగ ఉంగరం రాహు, కేతు దోషాలతో పాటుగా అమృత్యు అపాయాలను తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో కరెంట్ షాక్ మరికొన్ని అపాయాలను పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నాడు. అందుకే పండితుల సలహా మేరకు వాటిని ధరించినట్లు తెలుస్తోంది.