Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Surender Reddy movie update: వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పవర్ స్టార్..ఈసారి...

Pawan Kalyan Surender Reddy movie update: వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో పవర్ స్టార్..ఈసారి అయినా సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా?

Pawan Kalyan Surender Reddy movie update: ఒకపక్క పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ అప్డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఇంతలోపే ఆయన సురేందర్ రెడ్డి(surender reddy) తో చేయబోయే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాని ఉగాది పర్వదినాన పూజా కార్యక్రమాల ద్వారా మొదలు పెట్టనున్నారు. ఇక తర్వాత ఏప్రిల్ లేదా మే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించనున్నారు మేకర్స్. ఈ సినిమాకు వక్కంతం వంశీ స్టోరీ ని అందిస్తున్నాడు. సురేందర్ రెడ్డి తో కలిసి ప్రస్తుతం ఆయన క్లైమాక్స్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కూడా ‘ఓజీ’ లాగానే గ్యాంగ్ స్టర్ నేపథ్యం లో తెరకెక్కబోతుంది. సురేందర్ రెడ్డి చిత్రాల్లో హీరో క్యారెక్టర్స్ చాలా భిన్నంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ కి కూడా అలాంటి భిన్నమైన క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసినట్టు సమాచారం.

గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సరికొత్త హెయిర్ స్టైల్ లో కనిపించడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ హెయిర్ స్టైల్, మేకోవర్ సురేందర్ రెడ్డి సినిమా కోసమేనట. లుక్ టెస్ట్ కూడా జరిగింది. అభిమానులకు ఈ లుక్ తెగ నచ్చేసింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. పవన్ కళ్యాణ్ కి ఇది మూడవ సంక్రాంతి సినిమా. అయితే పవన్ కళ్యాణ్ కి సంక్రాంతి ఇప్పటి వరకు పెద్దగా కలిసిరాలేదు. గతం లో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించిన ‘గోపాల గోపాల’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై, కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో నిల్చింది. ఇక ఆ తర్వాత మళ్లీ ఆయన సంక్రాంతికి ‘అజ్ఞాతవాసి’ చిత్రం తో వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే.

ఈ ట్రాక్ రికార్డు చూసి, పవన్ కళ్యాణ్ కి సంక్రాంతి సెంటిమెంట్ అసలు కలిసి రావడం లేదు,అలాంటి సంక్రాంతికి రావడం ఎందుకు?, ఇప్పటికే వచ్చే సంక్రాంతికి వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా రాబోతుంది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకు కూడా సంక్రాంతి నే టార్గెట్. బాలయ్య , గోపీచంద్ మలినేని కాంబినేషన్ చిత్రం, అదే విధంగా నాగార్జున 100 వ సినిమా కూడా సంక్రాంతి నే టార్గెట్ చేశాయి. పవన్ కళ్యాణ్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే, ఇన్ని సినిమాలు పోటీ ఉండకూడదు. పైగా గ్యాంగ్ స్టర్ జానర్ సినిమాలకు సంక్రాంతి సీజన్ కరెక్ట్ కాదు. మరి ఈ చిత్రం ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version