వీర‌మ‌ల్లు హీరోచిత విన్యాసాలు.. అశ్వ సార‌థ్యంలో చుక్క‌లేన‌ట‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు నాలుగు చిత్రాల‌ను అనౌన్స్ చేశారు. ఇందులో వ‌చ్చే నెల విడుద‌ల కాబోయే సినిమా కూడా ఉంది. కానీ.. ఫ్యాన్స్ తోపాటు స‌గ‌టు ప్రేక్షకుడి క్యూరియాసిటీ మొత్తం ఒకే చిత్రంపై ఫోక‌స్ అయి ఉంది. అదే.. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు! ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఈ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కు సంబంధించిన ప్ర‌తీ అప్డేట్ హై ఓల్టేజ్ రెస్పాన్స్ క్యాచ్ చేస్తోంది. 15వ శ‌తాబ్దం నాటి ప‌రిస్థితుల ఆధారంగా రూపొందిస్తున్న ఈ […]

Written By: Bhaskar, Updated On : March 14, 2021 5:35 pm
Follow us on


ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు నాలుగు చిత్రాల‌ను అనౌన్స్ చేశారు. ఇందులో వ‌చ్చే నెల విడుద‌ల కాబోయే సినిమా కూడా ఉంది. కానీ.. ఫ్యాన్స్ తోపాటు స‌గ‌టు ప్రేక్షకుడి క్యూరియాసిటీ మొత్తం ఒకే చిత్రంపై ఫోక‌స్ అయి ఉంది. అదే.. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు!

ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఈ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కు సంబంధించిన ప్ర‌తీ అప్డేట్ హై ఓల్టేజ్ రెస్పాన్స్ క్యాచ్ చేస్తోంది. 15వ శ‌తాబ్దం నాటి ప‌రిస్థితుల ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. నాటి చార్మినార్ ను క‌ళ్ల‌కు క‌ట్టేందుకు ఇప్ప‌టికే భారీ సెట్ ను నిర్మించారు. నాటి గండికోట సంస్థానాన్ని కూడా పున‌ర్ నిర్మించారు.

Also Read: మెగాస్టార్ మాట మీద నిలబడతారా ?

ఇంతేకాకుండా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బ‌డ్జెట్ మూవీగా దాదాపు 170 కోట్ల వ్య‌యంతో నిర్మిస్తున్నారు మెగా ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం. అంతేకాకుండా.. ప‌వ‌న్ కెరీర్లో తొలి హిస్టారిక‌ల్ మూవీ కూడా ఇదే కాబోతోంది. ఇలా.. ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌ను సొంతం చేసుకున్న ఈ మూవీలో యాక్ష‌న్ సీన్స్ నెవ్వ‌ర్ బిఫోర్ అన్న రేంజ్ లో షూట్ చేస్తున్నాడ‌ట క్రిష్‌.

Also Read: రమ్యకృష్ణకు నైట్ అవి ఉండాల్సిందేనట !

ప‌వ‌న్ ఈ సినిమాలో వ‌జ్రాల దొంగ‌గా క‌నిపించ‌బోతున్నాడు. కాబ‌ట్టి.. ఛేజింగ్ లు ఏ స్థాయిలో ఉంటాయో స్పెష‌ల్ గా చెప్పాల్సిన ప‌నిలేదు. వీర‌మ‌ల్లును ప‌ట్టుకునేందుకు సైనికులు అశ్వాల‌తో దూసుకొస్తుంటే.. త‌న గుర్ర‌పు డెక్క‌ల శ‌బ్దాన్ని మాత్ర‌మే వినిపిస్తూ.. క‌ళ్ల‌కు క‌నిపించ‌కుండా దౌడు తీయించ‌బోతున్నాడ‌ట ప‌వ‌న్‌. ఈ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌డానికి హాలీవుడ్ చిత్రాల‌కు వ‌ర్క్ చేసిన వీఎఫ్ఎక్స్ నిపుణుల‌ను రంగంలోకి దించార‌ట‌.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

అంత‌కంత‌కూ హై రేంజ్ క్యూరియాసిటీని ఫిల్ చేస్తున్న ఈ చిత్రానికి కీర‌వాణి మ్యూజిక్ తోడ‌వ‌డంతో.. బొమ్మ ఏ రేంజ్ లో ఉంటుందోన‌ని అంచ‌నాలు వేసుకుంటున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్‌, బాలీవుడ్ భామ జాక్వెలిన్ న‌టిస్తున్నారు.