Homeఎంటర్టైన్మెంట్Dolby Theatre Ticket Rates: పాప్ కార్న్ 200.. టికెట్ 1000.. డాల్బీ అంటే జస్ట్...

Dolby Theatre Ticket Rates: పాప్ కార్న్ 200.. టికెట్ 1000.. డాల్బీ అంటే జస్ట్ అధికారిక దోపిడీ అంతే

Dolby Theatre Ticket Rates: పెట్రోల్ ధర పెరుగుతుంది. ధర ఎంత పెరిగినా సరే కొనుగోలు చేయాల్సిందే. బండ్లో పోసుకొని వెళ్లాల్సిందే. మనం వాడే నిత్యవసరాల ధరలు పెరిగితే.. ఆ ప్రభావం మన మీద ఉంటుంది. కాకపోతే అవి లేకుండా మనం బతికే పరిస్థితి ఉండదు కాబట్టి కొనుగోలు చేయాల్సిందే.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ట్రైలర్ రివ్యూ : పవన్ కళ్యాణ్ లో ఇంత కామెడీ టైమింగ్ చూసి ఎన్ని రోజులైందో!

సినిమా అనేది మనకు నిత్యవసరం కాదు. కేవలం కాలక్షేపం మాత్రమే. ఒకరకంగా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ మన జీవితంలో అనేక విధాలుగా ఉంటుంది. కాకపోతే సినిమాలను నిర్మించేది బడా బాబులు.. పైగా వారికి రాజకీయ నేపథ్యం ఉంటుంది కాబట్టి.. జనాలకు సినిమాలను అలవాటు చేసి సొమ్ము చేసుకుంటారు.. నిత్యావసరాలకు మించిన అవసరంగా సినిమాను రుద్దుతారు. దీనివల్ల నిర్మాతలు భారీగా లాభాలను పొందుతారు.

ఇటీవల కోకాపేట ప్రాంతంలో ఓ సినిమా థియేటర్ ప్రారంభమైంది. దీనిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ అని.. ఇది డాల్బీ భాగంలో అత్యద్భుతమైనదని ప్రచారం చేసుకున్నారు. నిజానికి ఆ థియేటర్ గురించి కొంచెం లోతుగా పరిశీలన చేస్తే దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ థియేటర్లో టికెట్ ధర వెయ్యి రూపాయల వరకు ఉంది. పాప్ కార్న్ ధర 200 వరకు ఉంది. ఇక వాహనాల పార్కింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతటి దోపిడి అమెరికాలోని థియేటర్లలో కూడా ఉండదు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో సినిమాను వ్యాపారంగా చేసి . . ప్రేక్షకుల జేబులను గుల్ల చేయడంలో నిర్మాతలు ఆరితేరి పోయారు.

సంక్రాంతికి విడుదలైన సినిమాలకు సంబంధించి టికెట్ ధరలను ఇష్టానుసారంగా పెంచేశారు. ఇందులో ఒక్క సినిమా అయినా ఆకట్టుకునే విధంగా ఉందంటే లేదు అనే చెప్పాలి. నటులు, సాంకేతిక నిపుణులు భారీగా డబ్బులు తీసుకుంటూ.. సినిమా నిర్మాణ ఖర్చును భారీగా పెంచేసి.. వాటిని ప్రేక్షకుల జేబుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు డాల్బీ పేరుతో.. సరికొత్త సాంకేతిక ప్రపంచాన్ని ప్రేక్షకులకు ముందు తీసుకొచ్చామని ప్రచారం చేస్తున్నారు. సినిమా బాగుంటే ఎందులో చూసినా ఇబ్బంది ఉండదు. డబ్బు బాగా ఉన్నవాళ్లు మాత్రమే రకరకాల టెక్నాలజీని కోరుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలలో డబ్బు బాగా ఉన్నవాళ్లకంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్లే అధికంగా ఉంటారు. అలాంటప్పుడు ఆ డాల్బీ థియేటర్ ఎవరిని ఉద్దేశించి నిర్మించారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినిమాలను డబ్బున్న వాళ్ళ కంటే.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారే ఎక్కువగా చూస్తుంటారు. అలాంటి వారికి వినోదాన్ని అత్యంత ఖరీదైన వస్తువుగా మార్చడం ఇలాంటి ఎంటర్టైన్మెంటో ఘనత వహించిన సినిమా పెద్దలే చెప్పాలి. ఆమధ్య ఐ బొమ్మ రవి గురించి లెక్చర్లు దంచిన సినీ పెద్దలు.. డాల్బీ దోపిడీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎందుకంటే ఐ బొమ్మ రవి ఓ మామూలు వ్యక్తి. సినిమా పెద్దలు సమాంతర శక్తులు. వారికి ప్రభుత్వం అండ ఉంటుంది కాబట్టి దోపిడీ రాజమార్గంగా సాగిపోతూ ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version