Poonam Kaur: తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు నటి పూనమ్ కౌర్. ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను, తన అభిప్రాయాలను ఫాలోవర్స్‌తో, ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు పూనమ్. ఈ క్రమంలో ఆమె పలు అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. దీంతో ఆమె ట్వీట్స్‌పై నెటిజన్లు నిగూడార్థాలు వేతుకుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా పూనమ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.

తాజాగా ట్విట్టర్ వేదికగా ఆమె విడాకుల గురింకీ ఒక పోస్ట్ పెట్టారు. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తాజాగా విడాకుల అంశంపై ప్రశ్నలను లేవనెత్తారు పూనమ్. “విడాకుల అనంతరం నిజంగా మగవారికి పెయిన్ ఉండదా … లేదంటే ఆడవాళ్లే ఇబ్బందులు పెడతారు. ఆడవాళ్లే వారిని మాటలతో బాధిస్తారు, వారి వల్లే మగవారికి కఠిన పరిస్థితులు వస్తుంటాయని ఈ సొసైటీ పక్షపాత ధోరణితో ప్రొజెక్ట్ చేస్తుందా… ఇప్పటికీ మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా, విడాకుల కోణంపై మనకు కచ్చితమైన దృక్కోణం ఉందా… అని పూనమ్ పోస్ట్ చేశారు. అయితే ఈ ట్వీట్ వేసిన గంటకే దాన్ని ఆమె డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది.
అసలు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసింది, ఎందుకు డిలీట్ చేసింది అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. విడాకుల అంశంపై ఇంత లోతైన పోస్ట్ పెట్టి డిలీట్ చేయడం పట్ల కారణం ఏమై ఉంటుందని సోషల్ మీడియా వేదికగా చర్ఛనీయాంశం అవుతుంది.