Poonam Kaur Sensational Comments: ఫేడ్ అవుట్ హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక రచ్చకు తెర తీస్తూ ఉంటుంది. తాజాగా పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు పెద్ద సినిమాలలో హీరోయిన్‌గా అవకాశాలొచ్చాయని, వాటిని సినీ ఇండస్ట్రీలోని రావణులు చెడగొట్టారని పేర్కొంది. మూడేళ్లుగా వ్యక్తిగతంగా, ఆరోగ్యం విషయంలోనూ పలు సమస్యలను అధిగమించినట్లు తెలిపింది.
Poonam Kaur
ఎన్ని అవాంతరాలెదురైనా సీత, ద్రౌపదిలను స్ఫూర్తిగా తీసుకుని, ముందుకు వెళతానని చెప్పింది. ఏమి ఏమైనా పూనమ్ మాట్లాడే మాటల్లో, పెట్టే ప్రతి ట్వీట్ లో, ప్రతి పోస్ట్ లో ఎన్నో నిగూడార్థాలు ఉంటాయి. అసలు అందరిదీ ఒక బాధ అయితే.. ఆమెది మరో బాధ అన్నట్టు ఉంటుంది ఆమె వ్యవహారం. దీనికితోడు తనకు సంబంధించిన ప్రతిదీ నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది.
Also Read: Chandrababu BJP: బీజేపీతో పొత్తుకు చంద్రబాబు సిద్ధంగా లేరా?
పైగా అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఆ మధ్య విడాకుల పై కూడా ఒక కామెంట్ పెట్టింది. “విడాకుల తర్వాత నిజంగా మగవారికి నిజంగానే పెయిన్ ఉండదా? కేవలం ఆడవాళ్లు మాత్రమే ఇబ్బందులు పడతారా.. ? లేదంటే.. ఆడవాళ్లే మగవారిని మాటలతో బాధిస్తారా ? ఆడవారి వల్లే మగవారికి కఠిన పరిస్థితులు వస్తుంటాయని ఈ సమాజం పక్షపాత ధోరణిని ఏమైనా ప్రొజెక్ట్ చేస్తుందా.. ?
ఇప్పటికైనా మనం అసలు విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నామా ? విడాకుల అంశం పై మనందరికీ కచ్చితమైన క్లారిటీ, సరైన దృక్కోణం ఉందంటారా ?” అంటూ ఇష్టమొచ్చినట్లు రాసుకుంటూ పోయింది పూనమ్. మొత్తానికి పూనమ్ ఇలా ఏదో రకంగా సోషల్ మీడియాలో రచ్చ చేయడానికి నానాపాట్లు పడుతుంది.
Also Read: Pawan Kalyan Pooja Hegde Movie: పవన్ తో సినిమా పై పూజా హెగ్డే రియాక్షన్ ఇదే