Poonam Kaur Comments On Pawan Kalyan: ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియా లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివా పై , ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అప్పుడప్పుడు పరోక్షంగా సెటైర్లు వేస్తూ ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ తనకు అన్యాయం చేసాడని , అతని చేసిన అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదని , ఇలా ఎన్నో సార్లు ఆమె ట్వీట్లు వేస్తూ వచ్చింది. ఈమె చేసే కామెంట్స్ ని వైసీపీ పార్టీ అభిమానులు బాగా ప్రోత్సహిస్తారు , అదే సమయం లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. అయితే ఒకప్పుడు ఈమె పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్స్ చేస్తూ ఉండేది , కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గానే కౌంటర్ అటాక్ చేస్తోంది. నిన్న ఆమె ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ సెన్సేషనల్ గా మారింది. ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించే చర్చ.
పూర్తి వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లాకు చెందిన షానవాజ్ అనే ముస్లిం యువతీ ఒమాన్ దేశం లో చిక్కుకొని, అక్కడ తీవ్రమైన ఇబ్బందులను ఎదురుకుంటోంది. అక్కడ కొంతమంది ఆమెని హింసలు పెడుతూ వేధిస్తున్నారని , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు , దయచేసి నన్ను వెనక్కి తీసుకొని వచ్చేలా చేయండి , ఇక్కడ నేను బ్రతకలేకపోతున్నాను అంటూ ఆ యువతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో ని విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది , పవన్ కళ్యాణ్ వరకు విషయం చేరింది. దీంతో పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం సహాయం కోరి , నరేంద్ర మోడీ మరియు రక్షణ శాఖా మంత్రి సహకారంతో ఆ ముస్లిం యువతీ ని సురక్షితంగా తన ఇంటికి చేర్చారు. అందుకు ఆ యువతీ కృతజ్ఞతా చెప్తూ ఒక వీడియో ని షేర్ చేసింది. ఈ వీడియో ని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతఙ్ఞతలు తెలియజేశారు.
ఆ వీడియో బాగా వైరల్ అవ్వడం తో పూనమ్ కౌర్ దీనిపై స్పందించింది . ఆమె మాట్లాడుతూ ‘ విజువల్ హంగుల కోసం సోషల్ మీడియా లో చేసే ప్రచారాలను నమ్మి మోసపోకండి. సుగాలి ప్రీతీ తల్లికి ఇచ్చిన మాటని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఆమెకు న్యాయం చెయ్యాలి. ఇంకా చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇలాంటి విజువల్ హంగులు కేవలం జనాల దృష్టిని మరల్చడానికే. ఒకవేళ ఆయన నిజంగా సహాయం చేసుంటే మంచిదే’ అంటూ కామెంట్ చేసింది. దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తూ , ఒక ఫక్తు వైసీపీ కార్యకర్త ఎలా మాట్లాడుతాడో, అలాగే మాట్లాడుతున్నావు అంటూ పూనమ్ కౌర్ పై మండిపడుతున్నారు పవన్ ఫ్యాన్స్.
A few days ago, Smt Shanawaz garu, a native of Vayalpadu in Annamayya district, shared a heartfelt video seeking help to return safely to India from Oman after facing serious difficulties there. After this issue came to my notice, I requested the Ministry of External Affairs… pic.twitter.com/U6N9xAYlev
— Pawan Kalyan (@PawanKalyan) May 8, 2026