కమల్ తో ఆ రిలేషన్ లేదంటున్న హీరోయిన్

ఇండియన్ సినిమాల్లో కమలహాసన్ లోకనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలనటుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన కమలహాసన్ ఆ తర్వాత హీరోగా రాణించారు. తెలుగు, తమిళంతోపాటు అన్నిభాషల్లో కమల్ హాసన్ నటించి ఇండియన్ యాక్టర్ గా పేరుతెచ్చుకున్నారు. ఆయన నటించిన ప్రతీ సినిమా అన్ని భాషల్లో విడులవుతుంటాయి. తమిళంతోపాటు తెలుగులోనూ కమల్ హాసన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కమల్ హాసన్ కు మాత్రం పెళ్లి జీవితం అంతగా కలిసి రాలేదు. కమల్ హాసన్ రెండు పెళ్లిళ్లు […]

Written By: Neelambaram, Updated On : May 25, 2020 8:28 pm
Follow us on


ఇండియన్ సినిమాల్లో కమలహాసన్ లోకనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలనటుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన కమలహాసన్ ఆ తర్వాత హీరోగా రాణించారు. తెలుగు, తమిళంతోపాటు అన్నిభాషల్లో కమల్ హాసన్ నటించి ఇండియన్ యాక్టర్ గా పేరుతెచ్చుకున్నారు. ఆయన నటించిన ప్రతీ సినిమా అన్ని భాషల్లో విడులవుతుంటాయి. తమిళంతోపాటు తెలుగులోనూ కమల్ హాసన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కమల్ హాసన్ కు మాత్రం పెళ్లి జీవితం అంతగా కలిసి రాలేదు. కమల్ హాసన్ రెండు పెళ్లిళ్లు చేసుకొని విడిపోయాడు. ఆ తర్వాత హీరోయిన్ గౌతమితో కొన్ని సంవత్సరాలు సహజీవనం చేశాడు. ఇటీవలే గౌతమి-కమలహాసన్ విడిపోయిన సంగతి తెల్సిందే. అయితే గౌతమితో విడిపోయాక కమల్ పూజా కుమార్ తో సహజీవనం చేస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా పూజా కుమార్ ఓ ఇంటర్యూలో క్లారిటీ ఇచ్చారు.

తాను కమలహాసన్ తో రిలేషన్లో ఉన్నానని వస్తున్న వార్తలో నిజం లేదని పూజా కుమార్ స్పష్టం చేసింది. తాను గడిచిన ఐదారేళ్లుగా కమల్ సార్ తో కలిసి పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. కమల్ హాసన్ ఓ గొప్ప క్రియేటర్.. క్రియేటివ్ జీనియన్ అని ప్రశంసలు కురిపించింది. ఆయన దగ్గరి నుంచి ఎన్నో కొత్త విషయాలను నేర్చకున్నానని పూజా కుమార్ తెలిపారు. అంతేకాకుండా కమల్ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పింది. ఆయన కుటుంబ సభ్యులు, కూతుళ్లతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని పూజా కుమార్ తెలిపారు. ఇదిలాఉంటే గతేడాది జరిగిన కమల్ పుట్టినరోజు వేడుకల్లో పూజ స్వయంగా పాల్గొని అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు కమల్ ఫ్యామిలీతో ఫొటో దిగింది. కమల్ ఫ్యామిలీలో పూజా కుమార్ కన్పించడంతో వారిద్దరు రిలేషన్లో ఉన్నారనే ప్రచారానికి బీజం పడింది. తాజాగా దీనిపై ఆమె స్పందిస్తూ అలాంటిదేమీ లేదని తేల్చేసింది.

కాగా కమలహాసన్ కు శృతిహాసన్, అక్షర హాసన్, సుబ్బలక్ష్మి అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు. కమలహాసన్ ప్రస్తుతం ‘ఇండియన్-2’ మూవీలో నటిస్తున్నాడు. ‘ఇండియన్-2’ షూటింగుల్లో ఇటీవల పెద్ద ప్రమాదం జరుగగా అందులో నుంచి కమలహాసన్ క్షేమంగా బయటపడ్డారు. ఇండియన్-2 మూవీని దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్ నటిస్తున్నారు. త్వరలోనే ఇండియన్-2 సినిమాను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.