Pooja Hegde’s condition is worse. : సినీ పరిశ్రమ ఒక రంగుల ప్రపంచం..ఈరోజు ఉన్నట్టు రేపు అసలు ఉండదు..ఇక్కడ సక్సెస్ ఉంటేనే విలువ..సక్సెస్ లేకపోతే మూలాన పడేస్తారు..అదే సక్సెస్ ఉంటే మాత్రం బ్లాంక్ చెక్స్ ఇవ్వడానికి కూడా వెనకాడరు నిర్మాతలు..ఇప్పుడు ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాం అంటే వరుస హిట్స్ తో ఇండస్ట్రీ లో దూసుకుపోయిన పూజా హెగ్డే పరిస్థితి ప్రస్తుతం దయనీయం మారింది అని..పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసిన పూజా హెగ్డే ప్రస్తుతం వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతోంది.

ఒకప్పుడు గోల్డెన్ లెగ్..ఈమె ఉంటే సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అందరూ అనుకునేవాళ్లు..కానీ ఇప్పుడు మాత్రం ‘ఆమ్మో ఐరన్ లెగ్..ఈమెతో సినిమాలు తీస్తే రిస్క్’ అనే పేరు తెచ్చేసుకుంది..ఈ ఏడాది పూజా హెగ్డే ముట్టుకున్నా ప్రతీ సినిమా భస్మం అయిపోయింది..ఏడాది ప్రారంభం లో పాన్ ఇండియన్ మూవీ గా..ఇండియన్ టైటానిక్ గా విడుదలకు భారీ అంచనాలను ఏర్పాటు చేసిన ‘రాధే శ్యామ్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.
ఈ చిత్రానికి వచ్చిన నష్టాలు 200 కోట్ల రూపాయిల పైమాటే..ఇక తమిళనాడు లో హిట్టు మీద హిట్టు కొడుతూ నెంబర్ 1 స్టార్ గా అవతరించిన విజయ్ సక్సెస్ స్ట్రీక్ కి కూడా అడ్డుకట్ట వేసేసింది పూజా హెగ్డే..ఈ ఏడాది వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘బీస్ట్’ చిత్రం తమిళనాడు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది..ఈ సినిమా తర్వాత ఆమె చేసిన ‘ఆచార్య’ చిత్రం కూడా ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – కొరటాల శివ ఇంత పెద్ద కాంబినేషన్ కూడా పూజా హెగ్డే లెగ్ క్రింద పడి నలిగిపోయింది..ఇప్పుడు లేటెస్ట్ గా బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా మట్టికరిపించేసింది పూజా హెగ్డే..ఈమె బాలీవుడ్ క్రేజీ స్టార్ రణ్వీర్ సింగ్ తో కలిసి ‘సర్కస్’ అనే సినిమా చేసింది.
రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకుడు..నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది..అపజయం అనేదే ఎరుగని రోహిత్ శెట్టి కి ఏకంగా డిజాస్టర్ ఫ్లాప్ ఇచ్చేసింది..ఇలా వరుసగా ఫ్లాప్స్ రావడం తో పూజ హెగ్డే పని ఇక అయిపోయింది అని అందరూ అంటున్నారు..చూడాలి మరి భవిష్యత్తులో ఆమె కెరీర్ ఎలా ఉండబోతుందో..ప్రస్తుతం ఆమె మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.