https://oktelugu.com/

Pooja Hegde : మేడమ్ సార్.. మేడమ్ అంతే… ట్రెండీ వేర్లో పూజ హెగ్డే బోల్డ్ లుక్ వైరల్!

పూజ హెగ్డే లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తెలుగు చిత్రాలు చేతిలో లేని పూజ హెగ్డే ముంబైలోనే ఎక్కువగా ఉంటుంది. కెరీర్ సంగతి ఎలా ఉన్నా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : February 19, 2024 / 03:38 PM IST
    Follow us on

    Pooja Hegde : పూజ హెగ్డే కెరీర్ ప్రమాదంలో ఉంది. వరుస పరాజయాలతో ఆమె రేసులో వెనుకబడింది. ఒక దశలో పూజ హెగ్డే సినిమాకు రూ. 5 కోట్ల వరకు తీసుకుంది. ఇప్పుడు అంత డిమాండ్ లేదు. చెప్పాలంటే ఆమె చేతిలో సినిమాలు కూడా లేవు. 2022 నుండి పూజ హెగ్డేకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. రాధే శ్యామ్ చిత్రంతో ఆమెకు పరాజయాలు మొదలయ్యాయి. ఆ ఏడాది దాదాపు ఐదు సినిమాలు విడుదల చేసింది. రాధే శ్యామ్ అనంతరం విడుదలైన ఆచార్య డిజాస్టర్ అయ్యింది.

    కోలీవుడ్ స్టార్ విజయ్ కి జంటగా బీస్ట్ మూవీ చేయగా అది కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ మేనియాతో చెప్పుకోదగ్గ వసూళ్ళు రాబట్టింది. బీస్ట్ ప్లాప్ ఖాతాలో చేరింది. బాలీవుడ్ మూవీ సర్కస్ కూడా డిజాస్టర్. రణ్వీర్ సింగ్ హీరోగా నటించగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. దాంతో సల్మాన్ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. వీరమ్ రీమేక్ గా తెరకెక్కిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఆశించిన స్థాయిలో ఆడలేదు.

    అలా వరుసగా ఐదు ప్లాప్స్ పడ్డాయి. దానికి తోడు చేతిలో ఉన్న బడా ప్రాజెక్ట్ కూడా చేజారాయి. ప్రస్తుతం పూజ హెగ్డే ఖాళీగా ఉంది. అధికారికంగా ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఈ క్రమంలో పూజ హెగ్డే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. తాజాగా గ్రీన్ ట్రెండీ వేర్లో గ్లామరస్ పోజుల్లో మైండ్ బ్లాక్ చేసింది. అమ్మడు అందాలు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి.

    పూజ హెగ్డే లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తెలుగు చిత్రాలు చేతిలో లేని పూజ హెగ్డే ముంబైలోనే ఎక్కువగా ఉంటుంది. కెరీర్ సంగతి ఎలా ఉన్నా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ విరామ సమయంలో నచ్చిన ప్రదేశాల్లో విహరిస్తోంది. ఆ మధ్య శ్రీలంక వెళ్లిన పూజ హెగ్డే… అక్కడ కొన్ని రోజులు టూర్ ఎంజాయ్ చేసింది. పూజ హెగ్డే పై ఎఫైర్ రూమర్స్ కూడా ఉన్నాయి. మరి థర్టీ ప్లస్ లో ఉన్న పూజా హెగ్డే, పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో చూడాలి…