Pooja Hegde
Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఆమె లీగల్ నోటీసులు పంపారు. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు ఏడాది కాలంగా సంచలన ట్వీట్స్ తో వార్తల్లో ఉంటున్నారు. ఇండియన్ స్టార్ హీరోలు, హీరోయిన్స్ కి లింక్ పెడుతూ దారుణమైన పోస్ట్స్ పెడుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా పలువురు స్టార్స్ మీద అనుచిత కామెంట్స్ చేశారు. ప్రభాస్-కృతి సనన్ ప్రేమించుకుంటున్నారు. మాల్దీవ్స్ లో ఎంగేజ్మెంట్ అంటూ వరుస ట్వీట్స్ చేశాడు.
టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబును కూడా వదల్లేదు. ఇక పూజా హెగ్డే మీద ఉమర్ సంధు అనేక రూమర్స్ క్రియేట్ చేశాడు. సల్మాన్ ఖాన్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుందని, అందుకే ఆయన బ్యానర్లో మరో రెండు సినిమాలు చేసే అవకాశం ఇచ్చాడంటూ ట్వీట్ చేశాడు. ఇటీవల ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందంటూ మరో ఆరోపణ చేశాడు.
వరుస ప్లాప్స్ తో డీలా పడ్డ పూజా హెగ్డే తన నివాసంలో సూసైడ్ చేసుకోబోయింది. కుటుంబ సభ్యులు చూసి కాపాడారంటూ ట్వీట్ చేశారు. ఉమర్ సంధు ఆగడాలు పెరిగిపోతున్న క్రమంలో పూజా హెగ్డే అతనిపై పరువు నష్టం కేసు వేశారు. నోటీసులు పంపారు. సదరు నోటీసులను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఉమర్ సంధు పూజా హెగ్డేను హేళన చేశాడు. ఈ నోటీసులు తననేమీ చేయవన్న విశ్వాసం ప్రకటించారు.
కృతి సనన్ కూడా ఆయనకు నోటీసులు పంపింది. ప్రభాస్ తో బ్రేకప్ మేటర్ లీక్ చేసినందుకు నాకు కృతి సనన్ నోటీసులు ఇచ్ఛందని ట్వీట్ చేశాడు. ఎక్కడో దుబాయ్ లో ఉండే ఉమర్ సంధు ఇండియన్ చట్టాలు తనను ఏమీ చేయలేవని ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియా కామెంట్స్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే పూజా హెగ్డే నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ తో ఒక మూవీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. పూజా హెగ్డే గుంటూరు కారం మూవీ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే.
https://twitter.com/UmairSandu/status/1683900671945211923