Homeఎంటర్టైన్మెంట్Pooja Hegde : రెడ్ డ్రెస్ లో పూజ హెగ్డే గ్లామర్ ట్రీట్... ఆ...

Pooja Hegde : రెడ్ డ్రెస్ లో పూజ హెగ్డే గ్లామర్ ట్రీట్… ఆ సౌందర్యం చూసి కళ్ళు తిప్పుకోవడం కష్టమే!

Pooja Hegde : టాలీవుడ్ వేదికగా స్టార్ అయిన పూజ హెగ్డేకి బ్యాడ్ టైం నడుస్తుంది. ఒక దశలో వరుస విజయాలు నమోదు చేసిన పూజ హెగ్డే హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. రాధే శ్యామ్ అనంతరం పూజ హెగ్డే నటించిన ఒక్క సినిమా ఆడలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఆమె చివరిగా నటించిన హిట్ మూవీ. ఆచార్య, బీస్ట్, కిసీ కా జాన్ కిసీ కి భాయ్, సర్కస్, దేవా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. గోల్డెన్ లెగ్ కాస్త ఐరన్ లెగ్ ఇమేజ్ గా మారింది.

Also Read : ఇద్దరు కొడుకులతో కుమ్మేసింది, ఇప్పుడు తండ్రిపై కన్నేసింది… ఆయనతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి సిద్ధమైన పూజా హెగ్డే

పూజ హెగ్డేకి త్రివిక్రమ్ అత్యంత సన్నిహితుడు. ఫేడ్ అవుట్ దశలో ఉన్న ఆమెకు బ్రేక్ ఇచ్చింది ఆయనే. అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. ఆ మూవీ హిట్ అయ్యాక పూజకు ఆఫర్స్ పెరిగాయి. ఇక త్రివిక్రమ్ తో పూజ హెగ్డే చేసిన మరొక చిత్రం అల వైకుంఠపురములో. ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ముచ్చటగా మూడోసారి గుంటూరుకారంలో ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకో పూజ ఈ చిత్రం నుండి తప్పుకుంది.

ప్రస్తుతం పూజ హెగ్డేకు తెలుగులో ఆఫర్స్ లేవు. దర్శక నిర్మాతలు ఆమెను పక్కన పెట్టేశారు. అయితే కోలీవుడ్ లో పూజ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది. సూర్య, విజయ్, రజినీకాంత్ వంటి టాప్ స్టార్స్ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. విజయ్ చివరి చిత్రం జననాయగన్. ఈ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ కావడం విశేషం. అలాగే సూర్య లేటెస్ట్ మూవీ రెట్రో లో సైతం పూజ నటిస్తుంది. రజినీకాంత్-లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ చిత్రంలో పూజ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

వీటితో పాటు రాఘవ లారెన్స్ కి జంటగా కాంచన 4లో పూజ హెగ్డే నటిస్తుంది. చేతి నిండా ఆఫర్స్ తో అమ్మడు బిజీగా ఉంది. మరోవైపు తీరిక చేసుకుని గ్లామరస్ ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. పూజ హెగ్డే తాజాగా రెడ్ చోళీ లెహంగా ధరించి మనసులు దోచేసింది. పూజ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

Also Read : అవకాశాల కోసం ఎలాంటి పనులు చేయడానికైనా నేను రెడీ..నాకు చాలా అవసరం అంటూ పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్!

RELATED ARTICLES

Most Popular