Pooja Hegde- Trivikram: ఓ షాకింగ్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. హీరోయిన్ పూజా హెగ్డే పవన్ మూవీ నుండి తప్పుకున్నారట. ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్న నేపథ్యంలో పవన్ కి జంటగా వేరొకరిని చూసుకోమన్నారట. విషయంలోకి వెళితే… దర్శకుడు హరీష్ శంకర్ తో పవన్ భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కెరీర్ లో మొదటిసారి పవన్ లెక్చరర్ రోల్ చేస్తున్నారు. పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా కమర్షియల్ అంశాలు జోడించి, సోషల్ సబ్జెక్టు తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక పవన్ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రాగా… ఈ గబ్బర్ సింగ్ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ మూవీలో పవన్ కి జంటగా పూజా హెగ్డేను ఎంపిక చేశారు. అధికారిక ప్రకటన రాకున్నప్పటికీ పూజా చేస్తున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో పూజాతో పవన్ జోడీ కట్టలేదు. ఆమెను ఎంచుకోవడానికి ఇది కూడా ఒక కారణం. పూజా హీరోయిన్ అనగానే ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే వాళ్ళ ఆశలపై ఆమె నీళ్లు చల్లి వెళ్లిపోయారనేది లేటెస్ట్ టాక్.
Also Read: Nagarjuna: నాగార్జున కి ఊహించని షాక్ ఇచ్చిన మాజీ కోడలు సమంత
ఈ ఏడాది ప్రారంభంలోనే భవదీయుడు భగత్ సింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సింది. భీమ్లా నాయక్ మూవీ కారణంగా వెనక్కిపోయింది. మరలా వినోదయ సిత్తం రీమేక్ కోసం భవదీయుడిని పక్కనబెట్టారన్న మాట వినిపిస్తోంది. అంటే మరో ఐదారు నెలల వరకు ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే సూచనలు లేవు. ఈ కారణంగా పూజా ప్రాజెక్టు నుండి తప్పుకున్నారట. బాలీవుడ్ లో కూడా వరుస చిత్రాలు చేస్తున్న పూజా డేట్స్ కుదిరేట్లు కనిపించడం లేదట.

కాగా పూజా వెళ్లిపోతుంటే పవన్ మిత్రుడు త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పూజాకు కెరీర్ ఇచ్చిన త్రివిక్రమ్ మాట ఆమె కాదంటుందా? ఆయన చెబితే పవన్ మూవీ చేయదా? అంటున్నారు. నిజంగా పూజాను ఒప్పించాల్సిన అవసరం వస్తే త్రివిక్రమ్ మాట వినాల్సిందే. అసలు ఫార్మ్ లో లేని పూజాకు స్టార్స్ పక్కన ఆఫర్స్ ఇచ్చి త్రివిక్రమ్ నంబర్ వన్ హీరోయిన్ చేశాడు. కాబట్టి ఆమె త్రివిక్రమ్ కి చాలా రుణపడి ఉన్నారు. కాబట్టి త్రివిక్రమ్ తలచుకుంటే పూజా తప్పక చేస్తారని అంటున్నారు.
Also Read: Poorna Engagement: హీరోయిన్ పూర్ణ సీక్రెట్ నిశ్చితార్థం..వరుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
.
Recommended Videos