
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ పూజా హెగ్డేకు మరో మంచి చాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ గా నటించే చాన్స్ వెదుక్కుంటూ వచ్చే సరికి పూజా వెంటనే ఓకె అనేసినట్లు బోగట్టా. పైగా కొరటాల శివ లాంటి టాప్ డైరక్టర్, మెగాస్టార్ హీరోగా చేస్తున్న సినిమా కావడం, అందుకే డేట్స్ కుదరకపోయినా.. పూజా ప్రస్తుతం చేస్తోన్న సినిమాల మేకర్స్ ను రిక్వెస్ట్ చేసుకుని మరీ ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించిందట.
Also Read: తన లేడీ బాస్ కి సూపర్ స్టార్ శుభాకాంక్షలు !
ఇక ఈ సినిమాలో అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయని టాక్. ఇక చిరు షూటింగ్ కు విరామం లేకుండా షూట్ చేసి ఆచార్యను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని.. ముందుగా యాక్షన్ లేని సీన్స్ ను ప్లాన్ చేస్తున్నారని.. ఆ తరువాత రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ లో కొన్ని ఫ్యామిలీ సీన్స్ ను తీస్తారని తెలుస్తోంది. పైగా కొరటాల ఈ సినిమాలో ఓ కామెడీ ట్రాక్ ను పెట్టారు. అది శ్రీధర్ సిపాన చేత రాయించారు. మొత్తానికి మెగాస్టార్ – కొరటాల కలయికలో ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రాబోతుంది.
Also Read: టీజర్ టాక్ : 8 ప్యాక్‌తో అదరగొట్టిన లక్ష్య !
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఆచార్య షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఏమాత్రం గ్యాప్ లేకుండా లూసిఫర్ రీమేక్ షూటింగ్ లో చిరు జాయిన్ అవుతాడట. అన్నట్లు ఇప్పటికే చిరు వేదాళం షూట్ లో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆచార్య వచ్చిన కేవలం రెండు నెలలకే వేదాళం రీమేక్ తో కూడా చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏది ఏమైనా మెహర్ రమేష్ కెరీర్ కు ఈ సినిమా ఎంతో కీలకం. వరుస ఫ్లాప్ లతో ఆరు సంవత్సరాలు ఖాళీగా ఉన్న మెహర్ రమేష్ కి చిరు ఛాన్స్ ఇచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్