
టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ తో చలామణి అవుతోన్న ఏకైక హీరోయిన్ ‘పూజా హెగ్డే’నే. నిజానికి పూజా కంటే అందగత్తెలు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. పైగా యాక్టింగ్ పరంగా కూడా ‘పూజా హెగ్డే’ గొప్ప నటి ఏమి కాదు. అయినా ఈ బ్యూటీకి చాల ఈజీగా స్టార్ డమ్ వచ్చింది. ప్రస్తుతం చేతిలో భారీ చిత్రాలు ఉన్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’లో మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా షూట్ కోసం యూరప్ వెళ్ళింది. యూరప్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక.. ఇండియా తిరిగి వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో పూజా పై షూట్ చేయనున్నారు. ఇప్పటికే ఫిల్మ్ సిటీలో భారీ హాస్పిటల్ సెట్ ని కూడా సిద్దం చేశారు.
Also Read: సీనియర్ హీరోలకు ‘కరోనా’ గుబులు తీరేదెన్నడూ?
అలాగే ‘పూజా హెగ్డే’ అఖిల్ అక్కినేని సరసన కూడా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలో నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు, వాసు వర్మ కలిసి నిర్మిస్తుండటంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అయ్యేది పూజానే అని టాక్ నడుస్తోంది. అసలుకే ఫుల్ క్రేజ్ లో ఉన్న పూజాకి, మళ్ళీ క్రేజ్ తెచ్చే సినిమాలు పడితే.. ఇక పూజా మరో పదేళ్లు టాలీవడ్ టాప్ హీరోయిన్ గానే కోమనసాగుతొందేమో. దీనికితోడు ఈ టాల్ బ్యూటీ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా నటించబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: హాట్ టాపిక్:ఆ మూవీలో నటించే జంటలకు పెళ్లి అవుతుందా?
అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాలో కూడా పూజానే హీరోయిన్ గా తీసుకోవాలని హరీష్ శంకర్ ఫిక్స్ అయ్యాడట. ఎలాగూ హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘వాల్మీకి’, డీజే జగన్నాధం సినిమాలలో హీరోయిన్ గా పూజానే నటించింది. అసలు టాలీవుడ్ లో ఆమె స్టార్ అయిందంటే.. తన కెరీర్ మొదట్లో హరీష్ శంకర్ ఇచ్చిన ఛాన్స్ లు వల్లే అని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. మొత్తానికి పూజా హీరోలను డైరెక్టర్లను బాగా పట్టుకుంటుందని.. అందుకే ఆమెకు భారీ అవకాశాలు వస్తున్నాయని కొంతమంది కామెంట్స్ చేస్తున్నా.. ఏ హీరోయిన్ లో లేని టాలెంట్ పూజాలో ఉంది కాబట్టే ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.