Pooja Hegde: పూజా హెగ్డే(Pooja Hegde) ఒక ఇంటర్వ్యూ ఇచ్చిందంటే బోలెడన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. తాను ఒక అద్భుతమైన నటి అని, తనను సౌత్ ఇండస్ట్రీ కేవలం అందాల అరోబోతల సీన్స్ కి మాత్రమే ఉపయోగించుకున్నారని, నేను ఎలాంటి క్యారక్టర్ ని అయినా చేయగలనని, కానీ నన్ను గుర్తించలేదంటూ బాలీవుడ్ లో పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది. దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్రస్తుతం ఇండియా లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో అసలు కనీస స్థాయి యాక్టింగ్ స్కిల్స్ లేని హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది పూజ హెగ్డే మాత్రమేనని, ఆమెకు ఇచ్చిన చిన్న చిన్న పాత్రలను కూడా సరిగా పోషించలేకపోయిందని, ఆమె ఒక్క ఎమోషనల్ సన్నివేశం లో నటిస్తే బోలెడంత ట్రోల్ స్టఫ్ మీమర్స్ వస్తుందని పూజ హెగ్డే పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు.
Also Read: మరగుజ్జుగా కనిపించబోతున్న రామ్ చరణ్..అభిమానులు తట్టుకోగలరా!
ఇది ఇలా ఉండగా పూజా హెగ్డే మన తెలుగు సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. ఇప్పుడు ఆమె ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వస్తుంది. రీసెంట్ గానే ఆమె బాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన వరుణ్ ధావన్(Varun Dhawan) తో కలిసి ‘హే జవాన్ తో ఇష్క్ హోనా హై’ అనే సినిమా చేసింది. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ లో పూజా హెగ్డే చురుగ్గా పాల్గొంటుంది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె డైరెక్టర్స్ మైండ్ సెట్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘హీరోయిన్స్ పట్ల డైరెక్టర్స్ కి ఒకే అభిప్రాయం ఏర్పడిపోయింది. కేవలం వీళ్ళు ఈ పాత్రలకు మాత్రమే సరిపోతారని వాళ్లకు వాళ్ళు నిర్ణయం తీసేసుకుంటున్నారు. ఒక కథలో పాత్ర గురించి రాసినప్పుడు, కొంతమంది హీరోయిన్స్ ని పిలిచి వాళ్ళు ఆ పాత్రకు సరిపోతారా లేదా అని ఆడిషన్ చేయాలి’.
‘నాకు తెలిసి అలాంటి ఆడిషన్స్ జరగడం చాలా తక్కువ. నా దృష్టిలో ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే, ప్రతీ సినిమాకు ఆడిషన్స్ లో పాల్గొనే పరిస్థితి రావాలి. కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్ గానే నేను ఒక తమిళ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం ఆడిషన్ కి వెళ్లాను. ఆడిషన్ చేసిన తర్వాత నేను ఆ పాత్రకు సరిపోను, నా వయస్సు చాలా చిన్నదాని చెప్పి పంపేశారు. అలా ఆడిషన్ చేసి నేను పలానా పాత్రకు సరిపోను అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈమధ్య కాలం లో ఇలాంటి సిస్టం కేవలం కొన్ని చోట్ల మాత్రమే చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘రెట్రో’ వచ్చే నెల 1వ తేదీన విడుదల కాబోతుంది.