Homeఎంటర్టైన్మెంట్Pooja Hegde: మూగ, చెవిటి పాత్రలో పూజ హెగ్డే, ఫ్యాన్స్ జీర్ణించుకోగలరా... బ్లాక్ బస్టర్ సిరీస్...

Pooja Hegde: మూగ, చెవిటి పాత్రలో పూజ హెగ్డే, ఫ్యాన్స్ జీర్ణించుకోగలరా… బ్లాక్ బస్టర్ సిరీస్ కోసం ఊహించని సాహసం

Pooja Hegde: గ్లామర్ రోల్స్ కి పూజా హెగ్డే కేరాఫ్ అడ్రెస్. ఆమె పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేసిన సందర్భం చాలా తక్కువ. అయితే ఒక బ్లాక్ బస్టర్ సిరీస్ కోసం పూజ హెగ్డే పెద్ద సాహసమే చేస్తుందట. ఆమె చెవిటి, మూగ అమ్మాయిగా నటించనుందట. ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. డిటైల్స్ చూద్దాం..

టాలీవుడ్ వేదికగా స్టార్ హోదా తెచ్చుకుంది పూజ హెగ్డే. అనంతరం బాలీవుడ్, కోలీవుడ్ లో సైతం బడా హీరోల సరసన నటించింది. కొన్నేళ్లుగా పూజ హెగ్డే వరుస పరాజయాలు ఎదుర్కొంటుంది. రాధే శ్యామ్ నుండి ఆమె నటించిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. తెలుగులో అయితే ఆమెకు ఆఫర్స్ కరువయ్యాయి. మన దర్శకులు పూజ హెగ్డేకు ఆఫర్స్ ఇవ్వడం లేదు. అయితే కోలీవుడ్ లో ఆమె భారీ చిత్రాలు చేస్తుంది.

Also Read: రాజమౌళి మహేష్ బాబు ను కొత్త స్టైల్ లోకి మార్చడం వెనక ఇంత కథ ఉందా..?

తలపతి విజయ్ నటిస్తున్న జన నాయగన్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇది విజయ్ చివరి చిత్రం హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సూర్యకు జంటగా రెట్రో చిత్రం చేస్తుంది. రజినీకాంత్-లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న కూలీ చిత్రంలో పూజ హెగ్డే నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. కూలి మూవీపై భారీ హైప్ ఉంది. నాగార్జున ఓ కీలక రోల్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ మార్క్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూజ హెగ్డే చేతిలో ఉన్న మరో కోలీవుడ్ ప్రాజెక్ట్ కాంచన 4. హీరో లారెన్స్ మరోసారి దర్శకత్వం వహించి నటిస్తున్నాడు. పూజ హెగ్డే తో పాటు నోరా ఫతేహి హీరోయిన్ గా నటిస్తుంది. కాంచన వెరీ సక్సెఫుల్ సిరీస్ గా ఉంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన కాంచన, కాంచన 2, కాంచన 3 విజయం సాధించాయి. కాగా కాంచన 4 షూటింగ్ జరుపుకుంటుంది. రెండు మూడు నెలల్లో థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది.

కాగా ఈ చిత్రంలో పూజ హెగ్డే చేస్తున్న పాత్రపై ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. పూజ హెగ్డే మూగ, చెవిటి అమ్మాయిగా ఛాలెంజింగ్ రోల్ చేయనుందట. లారెన్స్ చిత్రాల్లో ఈ తరహా పాత్రలు మనం చూస్తాము. కానీ హీరోయిన్ కి అంగవైకల్యం ఉన్న పాత్ర రాయడం విశేషం. ఇక పూజ హెగ్డే గ్లామరస్ రోల్స్ కి పెట్టింది పేరు. అలాంటి పూజ హెగ్డేను మూగ, చెవిటి అమ్మాయిగా ప్రేక్షకులు అంగీకరించగలరా అనే సందేహం కలుగుతుంది. పరిశ్రమలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

 

Also Read: తెలుగు లో తమిళ్ డైరెక్టర్ల హవా ఎక్కువవుతుందా..?

RELATED ARTICLES

Most Popular