Trivikram- Pooja Hegde: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తన మాటల గారడీ తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే ఒక్క బ్రాండ్..హీరో తో సంబంధం లేకుండా వసూళ్లను రాబట్టే సత్తా త్రివిక్రమ్ సినిమాకి ఉంది అనడం లో ఏ మాత్రం అతి సయోక్తి లేదు..పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాతవాసి సినిమా దారుణమైన పరాజయం పాలైన తర్వాత, ఇక అందరూ త్రివిక్రమ్ పని అయిపోయింది అని అనుకున్నారు..కానీ ఆ సినిమా విడుదల అయిన ఏడాది లోపే ఎన్టీఆర్ తూ అరవింద సమేత లాంటి సెన్సషనల్ హిట్ సినిమాని తీసి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు..ఇక ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో తీసిన అలా వైకుంఠపురం లో సినిమా ఎంత పెద్ద సెన్సషనల్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇప్పటికి టాలీవుడ్ లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ స్థానం ఈ సినిమాదే..లేటెస్ట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకి కూడా మాటలు అందించింది త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు.

ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి..ప్రస్తుతం హాలిడే ట్రిప్ ని విదేశాలలో ఫామిలీ తో పాటు ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు, ఇండియా కి తిరిగి రాగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడట..ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటి అంటే పూజ హెగ్డే ని ఈ సినిమా నుండి తొలగించి ప్రియాంక అరుళ్ మోహన్ ని హీరోయిన్ గా తీసుకునేందుకు ఆలోచిస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్..వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరోయిన్ ని ఈ సినిమాలో నటింప చేస్తే సినిమాకి ఒక్క కొత్త ఫ్రెష్ లుక్ వస్తుంది అని త్రివిక్రమ్ భావిస్తున్నాడట..ఈ విషయం తెలుసుకున్న పూజ హెగ్డే త్రివిక్రమ్ పై తీవ్రమైన అసహనం తో ఉన్నట్టు తెలుస్తుంది..నమ్మి కాల్ షీట్స్ ఇస్తే ఇలా చెప్పాపెట్టకుండా నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అని పూజ హెగ్డే గొడవ చేసినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.

Also Read: Chiranjeevi: చిరంజీవి నన్ను చంపేస్తా అని బెదిరించాడు
గతం లో కూడా అరవింద సమేత సినిమా కోసం తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ని తీసుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్..గతం వీళ్లిద్దరి కాంబినేషన్ అజ్ఞాతవాసి చిత్రం వచ్చింది..ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యేలోపు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనిరుధ్ ని పక్కన పెట్టి థమన్ ని తీసుకున్నాడు..సమె అదే ఫార్ములా ని పూజ హెగ్డే విషయం లో కూడా వాడుతున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్..పూజ హెగ్డే ఇటీవల కాలం లో నటించిన సినిమాలు అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి..ఆమె ప్రస్తుతం హిట్స్ లో లేదు కాబట్టే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమెని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది..ఇవి అన్ని గమనిస్తూ ఉంటె త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్స్ లో ఉన్న వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు అని అర్థం అవుతుంది అని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.

Also Read: Madin India Products: మేడిన్ ఇండియా ఉత్పత్తులు బ్యాన్