Ponniyin Selvan 2 Collections : గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై తమిళనాడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ కి సీక్వెల్ గా ‘పొన్నియన్ సెల్వన్ 2’ చిత్రం రీసెంట్ గానే విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.అయితే పొన్నియన్ సెల్వన్ చిత్రం అన్నీ భాషలకు కలిపి దాదాపుగా 500 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
కానీ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 కి ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తుంటే అంత వసూళ్లు రాబట్టే ఛాన్స్ లేదని తెలుస్తుంది.కారణం మొదటి భాగం కి ఉన్నటువంటి అంచనాలు, రెండవ భాగం కి లేకపోవడం, అందువల్ల ఓపెనింగ్స్ లో కాస్త వెనుకపడడం వల్లే పార్ట్ 1 రేంజ్ వసూళ్లు రాలేదని విశ్లేషకుల అభిప్రాయం.
పార్ట్ 1 కి పెద్దగా టాక్ రాలేదు, ఆ రేంజ్ టాక్ పార్ట్ 2 కి వచ్చి ఉంటే డిజాస్టర్ అయ్యేదని, పబ్లిక్ టాక్ మొదటి భాగం కంటే బాగుంది అని రావడం వల్లే ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయని ట్రేడ్ పండితుల అభిప్రాయం. ఇక ఈ సినిమా విడుదలై నేటికీ వారం రోజులు పూర్తి అయ్యింది.ఈ వారం రోజులకు గాను ఈ చిత్రం 290 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిందట.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 172 కోట్ల రూపాయలకు జరిగింది.ఇప్పటి వరకు వచ్చిన షేర్ 125 కోట్ల రూపాయిలు.అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి 47 కోట్ల రూపాయిల అవసరం ఉంది అన్నమాట.ఈ వారం లో ఆ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.