Posani Krishna Murali: ఇటీవల కాలంలో సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు అనేక విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. పోసాని మీడియా ముందు మాట్లాడిన మాటలు సినీ వర్గాల్లో సంచలనం రేపాయి. పవన్ కళ్యాణ్ మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తారు అని ఆరోపణలు చేశారు పోసాని… పవన్ అభిమానులు ఆయనను సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా దూషించే విధంగా ట్వీట్ చేయడం, ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడడం మొదలైన విషయాలను నటుడు పోసాని మురళి కృష్ణ మీడియా ముందు తెలియజేశారు.

పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలకు దీటుగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు పలు రకాల చోట్ల పోసాని పై కేసు నమోదు చేశారు. అయితే ఈ సంఘటన జరిగి పదిహేను రోజులు జరుగుతున్నా కానీ పోసాని పై పవర్ స్టార్ అభిమానులు ఇంకా కేసులు నమోదు చేస్తుండడం గమనార్హం.
అయితే ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణ మురళి పై గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫిర్యాదు చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా పవన్ పై వ్యక్తిగత ధూషణలు చేయడం సబబు కాదని వారు అన్నారు. సినిమా ఇండస్ట్రిలో ఉంటూ పవన్ కు సపోర్ట్ చేయడం మానేసి… రాజకీయ పార్టీలకు వత్తాసు పలకడం న్యాయం కాదని అభిమాన సంఘాల నాయకులు అన్నారు. పోసాని పై చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.