Manchu Manoj : మోహన్ బాబు(Manchu Mohanbabu) తనయుడు మంచు మనోజ్(Manchu Manoj) ని నేడు తిరుపతి పోలీసులు కాసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున మనోజ్ ఇంటికి వెళ్లిన పోలీసులు, ఆయన్ని తన ఇంటి నుండి తిరుపతి సమీపంలోని భాకరాపేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, అసలు ఏమి జరిగింది అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత కొంతకాలం గా మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదాలను మన కళ్లారా చూస్తూనే ఉన్నాము. ఆస్తి విషయంలో మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు, అన్నయ్య విష్ణు లతో పోరాడుతున్నాడు. ఇంట్లో కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన ఈ సమస్యని రోడ్డు మీదకు తీసుకొచ్చింది మంచు మనోజ్ యే. పరువునే తన ఊపిరి గా భావించే మోహన్ బాబు ఇలాంటి చర్యలను అసలు సహించలేదు. ఫలితంగా జరిగిన పరిణామాల కారణంగానే ఈరోజు మనోజ్ అరెస్ట్ కావాల్సి వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది.
గత నెలలో మనోజ్ సుమారుగా 250 మంది అభిమానులతో విమానాశ్రయం నుండి మోహన్ బాబు యూనివర్సిటీ కి ర్యాలీగా వెళ్లి, లోపలకు వెళ్లేందుకు ప్రయత్నం చేసాడు. అక్కడి సెక్యూరిటీ అనుమతించకపోవడం తో తనతో పాటు వచ్చిన అభిమానులు గేట్స్ బద్దలు కొట్టి లోపలకు దూసుకెళ్లే ప్రయత్నం చేసారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని, అభిమానుల పై లాఠీ ఛార్జ్ చేసి అక్కడి నుండి తరిమేశారు. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య మనోజ్ ని, అతని భార్య మౌనిక ని లోపలకు పంపారు. లోపలకు వెళ్లిన తర్వాత ఈ దంపతులిద్దరూ మనోజ్ అవ్వ తాతల సమాధులకు దండం పెట్టుకొని వెళ్లిపోయారు. అయితే మనోజ్ దౌర్జన్యంగా యూనివర్సిటీ లోపలకు వచ్చే ప్రయత్నంపై మోహన్ బాబు చాలా సీరియస్ అయ్యాడు. కోర్టు మనోజ్ ని యూనివర్సిటీ లోకి అడుగుపెట్టకూడదు అని ఆదేశాలు జారీ చేసినా, అతను పట్టించుకోలేదని, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ తన మనుషులతో లోపలకు వచ్చే ప్రయత్నం చేసాడని, తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలంటూ మనోజ్ పై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
ఆ అంశంపైనే ఇప్పుడు మనోజ్ ని పోలీసులు అరెస్ట్ చేసారా..?, లేదా వేరే ఏ కారణమైనా ఉందా అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అంతే కాకుండా రెండు రోజుల క్రితమే మోహన్ బాబు యూనివర్సిటీ సమీపం లో ఉన్నటువంటి రెస్టారంట్ ని మంచు విష్ణు సిబ్బంది ద్వంసం చేసారు. ఈ అంశంపై నిజానిజాలు తెలుసుకున్న పోలీసులు, మనోజ్ ని బాద్యుడిని చేస్తూ అరెస్ట్ చేసారా? అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా మనోజ్ అరెస్ట్ అవ్వడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఆస్తి కోసం కన్నకొడుకుని కూడా అరెస్ట్ చేయడానికి మోహన్ బాబు వెనకాడడం లేదని, ఇలాంటి తండ్రిని ఇప్పటి వరకు చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#news పోలీసుల అదుపులో మంచు మనోజ్..
కుటుంబ తగాదాల నేపథ్యంలో రిజిస్టర్ అయిన కేసులో.. pic.twitter.com/qwlbRwwsVO— devipriya (@sairaaj44) February 18, 2025